జగన్ సెటైర్ : బాబుకి దేవుడు ముందే సినిమా చూపించాడు

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో

  • Publish Date - March 11, 2019 / 01:47 PM IST

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు  చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  సమయంలో బయటపడిందన్నారు. తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు  చంద్రబాబు.. లగడపాటి రాజగోపాల్ తో సర్వే ప్రకటించారని అన్నారు. కొద్ది రోజుల్లోనే  లగడపాటి దొంగ సర్వేలు ఏపీలోనూ వస్తాయని విమర్శించారు. కాకినాడ వైసీపీ సమర  శంఖారావం సభలో జగన్ మాట్లాడారు.
Read Also : చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్

తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి సర్వే ఏమైందో అందరికీ తెలుసని జగన్ గుర్తు చేశారు.  పోలింగ్ కు 48 గంటల ముందు సర్వే ప్రకటించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం  చేశారని అన్నారు. కాంగ్రెస్-టీడీపీ మహాకూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం  సాధిస్తుందని లగడపాటి సర్వే ఇచ్చారని, కానీ అది తలకిందులు అయ్యిందని జగన్  అన్నారు. దేవుడు.. చంద్రబాబుకి ముందే సినిమా చూపించాడు అని జగన్ సెటైర్ వేశారు.  ఏపీలోనూ ఇలాంటి దొంగ సర్వేలు వస్తాయని, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం  జరుగుతుందని జగన్ హెచ్చరించారు.
Read Also : ఇదేంది సారూ : పవన్ కళ్యాణ్‌కు రెండు చోట్ల ఓటు

ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే  అవినీతి లేని పాలన అందిస్తామన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ  పథకాలు అందరికి అందేలా చూస్తామన్నారు.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు