పేమెంట్ పెంచ‌గానే రెచ్చిపోతే ఎలా : ప‌వ‌న్ పై విజ‌య‌సాయి సెటైర్లు

  • Publish Date - March 23, 2019 / 06:30 AM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారో, టీడీపీని వెనకేసుకొస్తూ ప్రతిపక్షాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయనకు ఇల్లు కట్టిచ్చింది. హెలికాప్టర్లు సమకూర్చింది ఎవరో తెలియనంత అమాయకులు కాదు ప్రజలు అన్నారు. ఆఖరికి మీ అభ్యర్థుల జాబితాను ఫైనల్‌ చేసింది కూడా ఆయన కాదా? అని ప్రశ్నించారు. 
Read Also : దళితుల ఓట్లు చీల్చేందుకే: పవన్ మాట మార్చాడు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేమెంట్‌ బాగా పెంచడంతో పవన్ కళ్యాణ్ తెగ రెచ్చిపోతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి విమర్శించారు. గెలిచే పార్టీనే ఎన్నికల్లో అన్ని పక్షాలు టార్గెట్ చేస్తాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చివరకు పాల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖరారై పోయిందని అంగీకరిస్తున్నారు. అందుకే జగన్ గారి పైనే విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఈ విషయం లోనైనా మీ అందరికీ క్లారిటీ ఉంది. సంతోషమని అన్నారు.

అలాగే గత ఎన్నికల్లో ఓట్లు చీలుతాయని పోటీ చేయలేదని, ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చాలని చూస్తున్నారని, తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న వారిని కూడా రాజకీయ సమిధలుగా చేసి మాట్లాడుతున్నారని అన్నారు. కాసింత కూడా బాధ్యత లేని నీచులు చంద్రబాబు రాజ్యంలో రంకెలేస్తున్నారు. ఏప్రిల్ 11 వరకు వీళ్లను భరించక తప్పదేమోనని అన్నారు.
Read Also : నారా లోకేష్‌కు గట్టి షాక్: మంగళగిరిలో మారిన రాజకీయం