World Biggest Lock for Ayodhya Ram Mandir :
World Biggest Lock for Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్యపై భక్తి వృద్ధ దంపతుల అమోఘమైన శ్రమ కూడా పారవశ్యంగా మారింది. రామయ్య దర్శనం త్వరలోనే జరగనుంది. అటువంటి అయోధ్య రామయ్య మందిరం కోసం ఎంతోమంది ఎన్నో రకాల కానుకలను సమర్పిస్తున్నారు. ఎవరి కానుకల ప్రత్యేక వారిదే. గుజరాత్ కు చెందిన భక్తులు రాముడి కోసం పంచ ద్రవ్యాలతో 108 అడుగుల పొడుగు అగరుబత్తి తయారు చేశారు.మరొకరు భారీ గంట తయారు చేశారు. ఇలా వినూత్నమైన కానుకలను తయారు చేసిన రామయ్యకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.
దీంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌కు చెందిన తన భార్యతో కలిసి అయోధ్య రామయ్య దేవాలయం కోసం భారీ తాళం కప్పను తయారు చేశాడు. ఈ తాళం స్వయంగా ఆ దంపతులు 400 కిలోల బరువు గల తాళాన్ని స్వహస్తాలతో తయారు చేశారు. ఈ తాళం 400 కిలోల బరువు, 10 అడుగుల ఎత్తు, 4.5 అడుగుల వెడల్పు, 9.5 అంగుళాల మందం కలిగి ఉంది.
Ayodhya Ram Mandir : అయోధ్య రామయ్య కోసం 108 అడుగుల పొడవు అగరుబత్తీ .. విశేషాలు ఎన్నో
ఈ భారీ తాళాన్ని స్వయంగా తామే తయారు చేశామని తెలిపారు అలీగఢ్‌కు చెందిన 66 ఏళ్ల సత్య ప్రకాశ్ శర్మ. తన ఇష్ట దైవమైన శ్రీరాముడి కోసం రూ.2 లక్షలు ఖర్చు చేసి ప్రపంచంలోనే అతి పెద్ద హ్యాండ్ మేడ్ తాళాన్ని తయారు చేశామని తెలిపారు. తాను తన కుటుంబ పోషణ కోసం తాళాలు తయారు చేసి అమ్ముతు జీవనం సాగిస్తున్నానని తనకు సహాయంగా తన భార్య కూడా ఉంటుందని తెలిపారు.చిన్నప్పటి నుంచి తాళాలు తయారు చేస్తునే జీవిస్తున్నానని తెలిపారు. రాముడి కోసం తయారు చేసిన భారీ తాళంలో శ్రీరాముడి చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నామని అంతా పూర్తి అయ్యాక ఈ తాళాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ అధికారులకు అందజేస్తామని తెలిపారు.అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయానికి అతి పెద్ద తాళం ఆకర్షణగా నిలవనుంది.