Bhadrachalam : వీటిని కూడా వదలడం లేదు, రాములోరి గుళ్లో 400 లడ్డూలు మాయం

ఆలయంలో ఉన్న లడ్డూలను కూడా వదలడం లేదు. తెలంగాణలో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన...భద్రాద్రిలో లడ్డూలు మాయం కావడం కలకల రేపింది.

Bhadrachalam

Bhadrachalam Laddu : ఆలయంలో ఉన్న లడ్డూలను కూడా వదలడం లేదు. దేవస్థానం ఇచ్చిన జీతాలు చాలడం లేదోమో గాని..అక్రమార్జన వైపు మొగ్గు చూపుతున్నారు కొందరు. ఆలయంలో డబ్బులను కాజేయడం, టికెట్లను అమ్ముకోవడం, ఇతరత్రా అక్రమాలకు పాల్పడుతూ..రెండు చేతుల్లా సంపాదిస్తున్నారు కొంతమంది. వీరి అక్రమాలకు అధికారులు చెక్ పెడుతున్నా..ఎక్కడో ఒక ఆలయంలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా..తెలంగాణలో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన…భద్రాద్రిలో లడ్డూలు మాయం కావడం కలకల రేపింది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 400 లడ్డూలు మాయం అయినట్లు గుర్తించారు అధికారులు.

Read More : Covid-19 : ఈ 5 లక్షణాలు ఉంటే.. కరోనా సోకినట్టే! 

భద్రాద్రి రాములోరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీ సీతారామచంద్ర స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. శ్రీరామనవమి పండుగకు భారీగా భక్తులు పోటెత్తుతుంటారు. ఇక్కడ స్వామి, అమ్మవార్ల దర్శనం అనంతరం ఎంతో భక్తిగా లడ్డూలను కొనుక్కొంటుంటారు. అయితే..ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో భద్రాద్రి ఆలయం నానుతోంది. మొన్నటికి మొన్న 1000 లడ్డూలు మాయం కావడం తెలిసేందే. తాజాగా..ఆలయంలో 400 లడ్డూలు మాయం అయినట్లు అధికారులు గుర్తించారు. రోజువారి తనిఖీల్లో ఈ గోల్ మాల్ బయటపడింది.

Read More : BAJAJ CHETAK : మరోసారి భారీగా ధర పెంపు, దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి లడ్డూలను మాయం చేసినట్లు గుర్తించారు. ఇతని వద్ద రూ. 8 వేలు రికవరీ చేశారు. లడ్డూ ప్రసాద విక్రయాలు, ఆర్జిత సేవల్లో కంప్యూటర్ ఆధారిత టికెట్ల జారీ విధానం అమలవుతున్న సంగతి తెలిసిందే. కానీ..భ్రదాద్రిలో మాత్రం…ఈ విధానానికి స్వస్తి పలికారు. దీంతో అవకతవకలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తరచూ వందలు, వేలు లడ్డూలు మాయం కావడం అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. వెంటనే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.