Covid-19 : ఈ 5 లక్షణాలు ఉంటే.. కరోనా సోకినట్టే!

ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఈ లక్షణాల ఆధారంగా వారికి కరోనా సోకిందని ప్రాథమిక అంచనా వేశారు.

Covid-19 : ఈ 5 లక్షణాలు ఉంటే.. కరోనా సోకినట్టే!

If You Have These 5 Symptoms Infected Of Covid 19

Updated On : September 30, 2021 / 9:06 AM IST

Covid-19 symptoms : ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించి ఉంది. కరోనా తీవ్రత తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ కొన్నిచోట్ల వైరస్ వ్యాపిస్తూనే ఉంది. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం ద్వారా కరోనా వ్యాప్తి నెమ్మదిగా అదుపులోకి వచ్చేస్తోంది. కరోనా ఇంకా పోలేదు. వైరస్ వ్యాప్తి ఇంకా తిరగబెడుతూనే ఉంది. కరోనా టెస్టుల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన వసతులు లేని చోట్ల టెస్టింగ్ కిట్లను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా వైరస్ ఇప్పటికీ చాలామందికి వ్యాపిస్తుందనే ఉద్దేశంతో పరిశోధకులు తమ అధ్యయనంలో కొన్ని కరోనా లక్షణాలను గుర్తించారు. ఈ లక్షణాల ఆధారంగా వారికి కరోనా సోకిందని నిర్ధారణకు రావొచ్చునని చెబుతున్నారు. ఇదే ప్రాథమిక అంచనాకు రావొచ్చునని సూచనలు చేశారు.
Covid Symptoms : కరోనా బాధితుల్లో ముగ్గురిలో ఒకరికి కనీసం ఒక దీర్ఘకాలిక లక్షణం ఉంటోంది!

లండన్ ఇంపిరియల్ కాలేజీకి చెందిన సైంటిస్టులు 2020 జూన్ నుంచి 2021 జనవరి మధ్య కరోనా పరీక్షలు చేయించుకున్న వారిని పరిశోధకులు అడిగి తెలుసుకున్నారు. కరోనా పరీక్షకు ముందు వారిలో ఎలాంటి లక్షణాలను అనుభవించారో చెప్పాలని తెలిపారు.  అన్ని కరోనా లక్షణాలను విశ్లేషించిన తర్వాత ఐదు వరకు ఉమ్మడి కరోనా లక్షణాలను ఎంపిక చేశారు. ఈ లక్షణాలు ఉన్నవారిలో 70శాతం నుంచి 75 శాతం మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ తేలిందని గుర్తించారు.

కరోనా లక్షణాల్లో ప్రధానంగా రుచి, వాసన కోల్పోవడం,  స్మెల్ పసిగట్టే  సామర్థ్యం తగ్గిపోవడం, చలి, దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న వారిలోనే  కరోనా సోకిందని ప్రాథమికంగా అంచనా వేయొచ్చునని తెలిపారు. మరోవైపు కరోనా కిట్ల కొరత అధికంగా ఏర్పడిన సమయాల్లో ముందు జాగ్రత్తగా ఈ లక్షణాలతో బాధపడుతున్నవారికి వెంటనే కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందని సూచించారు. మరికొంతమందిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించవు. అలాంటి వారి విషయంలో కూడా ఎంతమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
SCR : రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. అక్టోబర్ 1 నుంచి కీలక మార్పులు