Statue of Equality : పులకిస్తోన్న ముచ్చింతల్.. నాలుగు భాగాలుగా యాగశాల, హోమ ద్రవ్యాల సువాసనలు

పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా

Statue of Equality : పులకిస్తోన్న ముచ్చింతల్.. నాలుగు భాగాలుగా యాగశాల, హోమ ద్రవ్యాల సువాసనలు

Samata

Updated On : February 4, 2022 / 10:53 AM IST

Sri ChinnaJeeyar Swamy : భాగ్యనగరం ఆధ్మాత్మిక రాజధానిగా మారుతున్న మహత్తరఘట్టం సాక్షాత్కారమవుతోంది. మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. భక్తీపారవశ్యంలో ముంచెత్తుతూ సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం మూడో రోజుకు చేరుకుంది. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు అష్టాక్షరీ మహామంత్ర జపం.. ఏడున్నర గంటల వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటలకు హోమాలు ప్రారంభమయ్యాయి.

Read More : Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కోవిడ్ కేసులు నమోదు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరై మహా యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు తిరిగి హోమాలు ప్రారంభం కానున్నాయి.. సాయంత్రం ఇష్టిశాలల వద్ద దుష్టనివారణకు శ్రీ లక్ష్మీనారాయణేష్టి, వైనతేయేష్టిని నిర్వహించనున్నారు. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 114 యాగశాలు, 10వందల 35 హోమకుండాలతో ముచ్చింతల్ అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది. శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరోలోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది.

Read More : Nora Fatehi : సింహాలతో ఫొటోకి ఫోజులిచ్చిన ఐటెం సాంగ్స్ భామ

పవిత్ర యాగశాలను ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు. శ్రీరంగ క్షేత్రానికి ప్రతీకగా యాగశాల కుడివైపు భాగానికి భోగ మండపమని, తిరుమల క్షేత్రాన్ని స్మరించేలా మధ్య భాగానికి పుష్ప మండపమని, కాంచీపురానికి గుర్తుగా వెనుక వైపు ఉన్న భాగానికి త్యాగ మండపం, మేల్కోట క్షేత్రాన్ని తలచుకుంటూ ఎడమ వైపు ఉన్న మండపానికి జ్ఞాన మండపం అన్న నామకరణం చేసారు. ఆపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా 114 యాగశాలల్లో శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువు ప్రారంభమయింది.