Dharmapuri : ధర్మపురిలో బ్రహ్మోత్సవాలకు వేళాయే…పోలీస్ స్టేషన్ లో పూజలు
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు...ధర్మపురికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు....

Dharmapuri
Dharmapuri Temple Brahmotsavam : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2022, మార్చి 14వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో 15న కళ్యాణోత్సవం, 18 డోలోత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ ప్రాంతమంతా విద్యుత్ దీప వెలుగులతో శోభాయమానంగా తయారైంది. సోమవారం సాయంత్రం 06 గంటలకు పుట్ట బంగారం కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడుతారు.
Read More : Tirumala Devotees : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత ఇదే..
ఈ బ్రహ్మోత్సవాలకు ఈసారి నూతనంగా వాహన సేవలను ప్రారంభించనున్నారు. పోలీస్ స్టేషన్ లో స్వామి పూజలందుకోవడం రాష్ట్రంలో ఇక్కడే జరుగుతుంది. ఏటా ఉత్సవాల్లో సపరివార సమేతంగా పీఎస్ కు దక్షిణ దిగ్యాత్రలో భాగంగా చేరుకుంటారు. అక్కడ పోలీసు కుటుంబాలు భక్తి శ్రద్ధలతో స్వామి వారికి పూజలు చేస్తారు. ప్రభుత్వ పక్షాన మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ జి. రవి స్వామి వారికి స్వామి వారికి కల్యాణోత్సవం సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
Read More : Payal Rajput : తిరుపతిలో స్వామి వారిని దర్శించుకున్న పాయల్..
ఇక ధర్మపురికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. నదీ స్నానాల ఘట్టాల వద్ద తడకల షెడ్లను నిర్మించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ జి. రవి ఆదేశాలతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చేపట్టారు. ఆలయం ముందుభాగాన భక్తులకు ఎండ తగులకుండా టెంట్లను ఏర్పాటు చేశారు. స్వర దర్శనాలు, ప్రత్యేక దర్శనాలుగా విభజించారు. ఇక భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనుంది. జగిత్యాల డీఎం ఆధ్వర్యంలో జగిత్యాల, మెట్ పల్లి, కోరుట్ల, మంచిర్యాల, కరీంనగర్, ఆర్మూరు డిపోలకు చెందిన బస్సుల ట్రిప్పులు అదనంగా నడిపించేలా చర్యలు తీసుకున్నారు. వైద్యశాఖ పలు శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది.