Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీ వ్రతం రోజు లక్ష్మీ రూపు తప్పనిసరిగా కొనుక్కోవాలా?
వరలక్ష్మీ వ్రతం వేడుకలో మహిళలు బంగారం కొనుక్కుంటారు. ముఖ్యంగా బంగారు లక్ష్మీ రూపును కొని పూజలో పెడతారు. ఏటా లక్ష్మీ రూపు కొనుక్కోవాలా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. నిజంగానే ఏటా లక్ష్మీ రూపు కొనాలా?

Varalakshmi Vratham 2023
Varalakshmi Vratham 2023 : శ్రావణమాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం స్త్రీలంతా వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. అమ్మవారిని చక్కగా అలంకరించి పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. అయితే ఈ పూజ కోసం ఏటా బంగారు లక్ష్మీ రూపు కొంటారు. ప్రతి సంవత్సరం కొనాలని ఏమైనా రూల్ ఉందా? ఉంటే ఎవరు కొనాలి?
Srvaana Masam 2023 : శ్రావణమాసంలో వచ్చే పండుగలు వాటి విశిష్టతలు
వరలక్ష్మీదేవికి పూజ నిర్వహించే సమయంలో మహిళలు బంగారు లక్ష్మీ రూపు కొని పూజలో పెడతారు. పూజానంతరం వాటిని నల్లపూసల మధ్య గుచ్చుకుంటారు. అయితే ఏటా లక్ష్మీ రూపు కొనుక్కోవాలని రూలు ఉందా? అంటే లేదని ధర్మశాస్త్రం చెబుతోంది. ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలించి అవకాశం ఉంటే కొనుక్కోవచ్చు. అయితే ఈ లక్ష్మీరూపును ఎవరు కొని ఇవ్వాలి? అని కూడా చాలామందికి అనుమానం కలుగుతుంది. పూజ చేసుకునే ప్రతి స్త్రీకి ఆమె భర్త లక్ష్మీ రూపును కొని ఇవ్వడం శ్రేయస్కరం అట. కొనలేని పరిస్థితి ఎదురైనపుడు పాత లక్ష్మీ రూపు అయినా పూజలో పెట్టుకోవచ్చునట.
Varalakshmi Vratam 2023: వరలక్ష్మీ దేవిని ఏ పూవులతో పూజించాలి? ఏ పిండి వంటలు నైవేద్యం పెట్టాలి?
పూజ రోజు భర్త కొని తెచ్చిన కొత్త చీరను మాత్రమే కట్టుకోవాలట. పట్టుచీర ఉండాలనే నియమయం లేదు. పాత పట్టుచీర అయినా పెళ్లి పట్టు చీరతో అయినా పూజ చేసుకోవచ్చునట. పూజానంతరం 8 సంఖ్యకు తగ్గకుండా వాయినం ఇవ్వాలట. అష్ట లక్ష్ములు 8 మంది కాబట్టి 8 మంది స్త్రీలను అష్టలక్ష్ములుగా భావిస్తూ వాయినం ఇవ్వాలి. అయితే వరలక్ష్మీ వ్రతం అప్పు చేసి చేయకూడదట. ఉన్నంతలో మాత్రం పూజ కచ్చితంగా చేసుకోవాలని శాస్త్రం సూచిస్తోంది. ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 25 శుక్రవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బంగారు షాపులు కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.