Dussehra 2023 : దసరా అంటే అందరికీ సరదానే.. కానీ ఈ పండుగ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

దసరా పండుగను అందరూ సరదాగా జరుపుకుంటారు సరే.. ఈ పండుగ 10 రోజులు జరుపుకోవడం వెనుక ఉద్దేశం ఇప్పటి జనరేషన్స్‌కి తెలియకపోవచ్చును. దసరా వేడుకను జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏంటంటే?

Dussehra 2023 : దసరా పండుగ అంటే అందరికీ ఇష్టమైన పండుగ.. ఎంతో వేడుకగా.. సరదాగా జరుపుకుంటారు. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను చేసుకుంటారు. పదిరోజుల పాటు నిర్వహించే దసరా పండుగ జరుపుకోవడం వెనుక పురాణ కథలు ఉన్నాయి. దసరా 2023 అక్టోబర్ 15 న ప్రారంభం అవుతోంది. అక్టోబర్ 24న విజయదశమి పండుగను జరుపుకోనున్నారు.

దసరా పండుగను ఆశ్వీయుజ మాసంలో జరుపుకుంటారు. చెడుపై సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటాం. నవరాత్రులు దుర్గమాతను పూజిస్తారు. ఈ పండుగ జరుపుకోవడం వెనుక అనేక పురాణ కథలు కూడా ఉన్నాయి. రాక్షసుడైన రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరా జరుపుకుంటారు. రావణుడి భారీ దిష్టిబొమ్మలను బాణా సంచాతో కాల్చి ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటారు. రావణుడిని వధించిన తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చినట్లు చెబుతారు. ఈ సందర్భంతో పాటు విజయదశమి నాడు పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతారు.

Dussehra holidays : విద్యా సంస్థలకు 13 నుంచి దసరా సెలవులు.. ఎప్పటి వరకు అంటే?

జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో 9 రాత్రులు ఏకధాటిగా యుద్ధం చేసి అతనిని వధించిన సందర్భంలో దసరా పండుగ చేసుకుంటారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి. దీని వెనుక ఒక కథ ఉంది. బ్రహ్మ నుంచి వరాలు పొందిన మహిషాసురుడు అనే రాక్షుడు దేవతల్ని ఓడించి ఇంద్ర పదవిని లాక్కుంటాడు. అతడి ఆగడాలు తట్టుకోలేక ఇంద్రుడు తమ బాధను త్రిమూర్తులకు మొరపెట్టుకుంటాడు. మహిషుని ఆగడాలు విని త్రిమూర్తుల్లో రగిలిన క్రోధాగ్ని స్త్రీ రూపంగా జన్మిస్తుంది.

శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మతేజం పాదములుగా జన్మించిన ఆ స్త్రీ మూర్తి 18 బాహువులు కలిగి ఉంటుంది. శివుడు శూలం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలం.. హిమవంతుడు సింహం వంటివి వాహనములుగా ఇస్తారు. ఇలా దేవతలంతా ఇచ్చిన ఆయుధాలతో మహిషాసురుడితో అమ్మవారు భీకరమైన యుద్ధం చేస్తుంది. మహిషుడి తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాష్కలుడు, బిడాలుడు వంటి రాక్షసులను సంహరిస్తుంది. చివరికి మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషుని సంహరించిన రోజు దసరా పర్వదినంగా జరుపుకుంటున్నాము.

TSRTC: దసరాకు టీఎస్ఆర్టీసీ 5265 ప్రత్యేక బస్సులు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలేనట

విజయదశమినాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. శుభానికి సూచనగా ఆరోజు కొత్తగా కొందరు వ్యాపారాలు మొదలుపెడతారు. కొత్త పెట్టుబడులు పెడతారు. కొన్ని రాష్ట్రాల్లో ఈరోజున చిన్నపిల్లల్ని స్కూల్లో చేర్పిస్తారు. దసరా పండుగను పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలలో ఎంతో వేడుకగా చేస్తారు. రాముని జీవిత కథను నాటకలుగా ప్రదర్శిస్తారు. బెంగాలీలు జానపద పాటలు పాడతారు. దుర్గాదేవి విగ్రహాలను పూజించిన తర్వాత నిమజ్జనం చేస్తారు. విజయదవమి నాడు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదం అంటారు. ఆరోజు జమ్మి ఆకుల్ని ఇండ్లలో ఉంచుకుంటారు. బంధువులకు జమ్మి ఆకుల్ని ఇస్తారు. ఇలా చేయడం ద్వారా సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు.

ట్రెండింగ్ వార్తలు