Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో సరస్వతీదేవి అలంకార విశిష్టత.. నైవేద్యంగా ఏం పెట్టాలి? విద్యార్థులు కొలిస్తే..
అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు.

Devi Navaratrulu 2025
Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తారు. జ్ఞాన సంపద కోసం సరస్వతీ దేవిని భక్తులు కొలుస్తారు.
సరస్వతీదేవి అలంకార విశిష్టత, పూజా విధానం
- త్రిశక్తి స్వరూపిణి దుర్గాదేవి తనలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే ఈ రూపం విశిష్టత
- అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పించాలి
- నైవేద్యంగా దధ్యోదనం ఇవ్వాలి
- చింతామణి, కిణి, అంతరిక్ష, జ్ఞాన, నీల, ఘట, మహా సరస్వతులుగా సప్త నామాలతో పూజించాలి
- ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని అమ్మవారు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బొమ్మల కొలువులు పెట్టి, పేరంటాలు చేస్తారు
- పుస్తకాలను అమ్మవారి చెంత ఉంచి విద్యార్థులు పూజిస్తారు
- అక్షరాభ్యాసానికి బాసర, వర్గల్, శ్రీ కనక దుర్గమ్మ ఆలయాలకు వెళ్లవచ్చు
- ఋగ్వేదం, దేవీ భాగవతం, బ్రహ్మవైవర్త పురాణం, పద్మపురాణంలో సరస్వతీ దేవి గురించి ప్రస్థావన
- బ్రహ్మ సరస్వతిని సృష్టించాడు
- సృష్టి కార్యంలో బ్రహ్మకు తోడుగా ఉండేందుకు పుట్టిన సరస్వతీదేవి
- పరాశక్తి ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు (Devi Navaratrulu 2025)
సరస్వతి శ్లోకం
సరస్వతి నమ: స్తుభ్యం వరదే కామరూపిణి
విద్యరంభం కరిశ్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మ కేసర వర్ణని
నిత్యం పద్మాలయాం దేవీ సామం పాతు సరస్వతి
Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము.