Devi Navaratrulu 2025: అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దిని.. అమ్మవారి కథ చదివితే చాలు..

బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..

Devi Navaratrulu 2025: అమ్మవారి అత్యంత ఉగ్రరూపం మహిషాసురమర్దిని.. అమ్మవారి కథ చదివితే చాలు..

Devi Navaratrulu 2025

Updated On : September 20, 2025 / 3:03 PM IST

Devi Navaratrulu 2025: ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు సెప్టెంబరు 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇంద్రకీలాద్రిలో జరిగే ఉత్సవాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. తొమ్మిదో రోజున మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు.

ఇక్కడ అమ్మవారి సహజ స్వరూపం ఇదే. అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ నవమికి మహానవమి అని పేరు. అమ్మవారికి మహానవమి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెబుతుంటారు.

Also Read: ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి.. అమ్మవారిని పూజిస్తే..

శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం

అయిగిరినందిని, నందితమేదిని, విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్య శిరోధిని సిని, విష్ణువిలాసిని, జిష్ణునుతే
భగవతి హే శితికంఠ కుటుంబిని, భూరికుటుంబిని భూరికృతే
జయ జయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే

మహిషాసురుడిని చంపిన తర్వాత అమ్మవారు అదే స్వరూపంతో వెలిసింది. దసరా నవరాత్రుల్లో నవమినాడు అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరిస్తారు. అమ్మవారి అత్యంత ఉగ్రరూపం ఇదే. అష్ట భుజాలతో, ఆయుధాలతో, సింహ వాహనంపై అమ్మవారు ఉంటారు.

అమ్మవారి కథ

బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. విష్ణువు చొరవతో యాగం చేసి దేవుళ్ల శక్తులతో ఓ స్త్రీశక్తి సృష్టిస్తారు. జగన్మాత జన్మించి మహిషాసురుడు, అతడి అనుచరులతో యుద్ధం చేసి, వారందరినీ సంహరిస్తుంది. మహిషాసురమర్దినిని పూజిస్తే సకల దేవతల్నీ పూజించినట్లే. అమ్మవారు భయాలను పోగొట్టి, ధైర్యాన్ని ఇస్తుంది.

Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము.