Devi Navaratrulu 2025: దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ దోషాల నివారణ.. ఇలాచేస్తే అమ్మవారి ఆశీస్సులు

దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.

Devi Navaratrulu 2025: దుర్గాదేవిని పూజిస్తే రాహుగ్రహ దోషాల నివారణ.. ఇలాచేస్తే అమ్మవారి ఆశీస్సులు

Devi Navaratrulu 2025

Updated On : September 20, 2025 / 3:05 PM IST

Devi Navaratrulu 2025: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఎనిమిదో రోజు దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. త్రిశూలధారిగా, వ్యాఘ్రవాహన అయి దుర్గామాత కనపడతారు. వ్యాఘ్రవాహన అంటే పులిపై కూర్చున్న అమ్మవారు అని అర్థం.

అమ్మవారిని ఓం కాత్యానాయ విద్మహే.. కన్యాకుమారి ధీమహీ.. తన్నో దుర్గీ ప్రచోదయాత్ అంటూ ప్రార్ధన చేయాలి. ఓం దుం దుర్గాయ నమః మంత్రాన్ని పఠించాలి.

Also Read: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

అమ్మవారు దుర్గముడిని హతమార్చడానికి దుర్గాదేవి అవతారం ఎత్తింది. అమ్మవారిని పూజిస్తే రాహుగ్రహ దోషాలను నివారిస్తుంది. ఓం దుం దుర్గాయ నమః మంత్రాన్ని పఠించాలి. దుర్గతిని నివారించే పరాశక్తిగా అమ్మవారు దర్శనమిస్తారు.

శరన్నవరాత్రులలో భాగంగా నవదుర్గలలో దుర్గాదేవి రూపంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటే దుర్గతులను నివారిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే భక్తులకు శుభం కలుగుతుందని విశ్వాసం.

దుర్గాష్టమి రోజు 6 – 12 ఏళ్ల మధ్య వయసు ఉండే బాలికలకు పూజ చేస్తారు. వారికి తాంబూలాలతో పాటు కానుకలు ఇస్తారు. కన్యా పూజగా దీన్ని పిలుస్తారు. వారిలో అమ్మవారు కొలువై ఉంటారని చెబుతుంటారు. ఇలాచేస్తే దుర్గాదేవి ఆశీస్సులు పొందుతారు. దుర్గాదేవికి పులగాన్నంతో పాటు పులిహార నివేదించాలి.

Note: ఈ వివరాలు పాఠకులకు అవగాహన కోసం మాత్రమే రాశాం. వీటిని శాస్త్రాల్లో, పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా ఇస్తున్నాము.