Ganesh Chaturthi 2024 : మీరు ఇంట్లో బొజ్జ గణపయ్యను ప్రతిష్టిస్తున్నారా? అయితే తప్పనిసరిగా ఇలా చేయండి..

విఘ్నేశ్వరుడిని ఇంట్లో ప్రతిష్టించుకునే భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గణనాథుడ్ని ఎప్పుడూ ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

Ganesh Chaturthi 2024 : దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో కాలువుదీరి సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ఇవాళ్టి నుంచి రాబోయే పదకొండు రోజులు దేశవ్యాప్తంగా వాడవాడలా వినాయక నామస్మరణతో మారమోగనున్నాయి. అయితే, చాలా మంది భక్తులు తమ గృహాల్లో బుజ్జి గణపయ్యలను ప్రతిష్టించుకొని పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచనలు చేస్తున్నారు. బొజ్జ గణపయ్యను ఇంట్లో ఏ దిక్కున కూర్చోబెట్టాలి.. గణనాథుడి వద్ద ఎలాంటి శుభ్రత పాటించాలి.. వంటి అంశాలను ఓసారి తెలుసుకుందాం.

విఘ్నేశ్వరుడిని ఇంట్లో ప్రతిష్టించుకునే భక్తులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గణనాథుడ్ని ఎప్పుడూ ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.

గణనాథుడ్ని ప్రతిష్టించిన ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత వాతావరణం లేకుండా చూసుకోవాలి. గణనాథుడ్ని ప్రతిష్టించే ముందు ఆ స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం మంచిది.

ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో సాత్విక ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేయాలి. రోజుకు మూడు సార్లు పలు రకాల పిండి వంటలను గణపయ్యకు ఆహారాన్ని అందించాలి.

గణనాథుడ్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, విగ్రహాన్ని కొనుగోలు చేసే సమయంలో విగ్రహం పగలకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. గణపయ్యకు ఎరుపు, మిశ్రమ రంగుల దుస్తులను ధరించండి. ఎరుపు రంగు పూలను కూడా అందించండి.

గణేశుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు. కాబట్టి గణేశుడి పూజకు మధ్యాహ్న సమయం మరింత అనుకూలంగా పరిగణించబడుతుంది.

చవితి పూజలో వినాయకుడి ప్రతిమ, 21 రకాల పత్రీ తప్పనిసరి. నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటుగా విగ్రహాన్ని స్థానికంగా ఉండే చెరువులు, బావులు, నదుల్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది.

 

ట్రెండింగ్ వార్తలు