Dasara Festivities : శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై  వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  ఈరోజు  నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తు

Dasara Festivities : విజయవాడ ఇంద్రకీలాద్రిపై  వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మవారు  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  ఈరోజు  నాలుగవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అమ్మవారు  శ్రీ చక్ర అధిష్టానశక్తిగా,  పంచదశాక్షరీ  మహామంత్రాధి దేవతగా వేంచేసి తనని కొలిచే భక్తలను ఉపాసకులను అనుగ్రహిస్తుంది.

శ్రీ లక్షీదేవి,  శ్రీ సరస్వతి దేవి ఇరువైపులా వింజామరలతో  సేవిస్తూ ఉండగా  చిరుమందహాసంతో,  వాత్సల్య జితోష్నలను చిందిస్తూ చెరుకు గడను చేతపట్టుకోని శివును వక్షస్ధలంపై కూర్చోని   శ్రీ లలితా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చే  సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా అమ్మవారు త్రిపురసుందరిదేవి గా భక్తులచేత పూజ లందుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు