Sri Balatripura Sundari Devi
Dasara Festivals : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గ అమ్మవారు శుక్రవారం నాడు బాలా త్రిపురసుందరి దేవీగా భక్తులకు దర్శనిస్తున్నారు. ఈరోజు శుక్రవారం కావటంతో తెల్లవారు ఝాము నుంచే భక్తులు క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి వేచి ఉన్నారు. బాలా దేవి ఎంతో మహిమాన్వితమైనది.
శ్రీబాలామంత్రం సమస్తదేనీ మంత్రా్లోకెల్లా గొప్పది… ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువై ఉండే పవిత్రమైన శ్రీ చక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి.
అందుకే సాధకులు ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. దసరా శరనన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి.