Good luck items : అదృష్టం తెచ్చే వస్తువులు .. ఇంట్లో తప్పకుండా ఉంచుకోండి..
ఇంట్లో ఏమేమి వస్తువులు పెట్టుకోవాలా? అని ఆలోచిస్తున్నారా? అయితే అదృష్టాన్ని మీ ఇంటికి తీసుకొచ్చే వీటిని ఇంటికి తెచ్చుకోండి.

Home luck will come with these items
Good luck items In House : ఏదైనా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలంటారు. అటువంటి అదృష్టం కలిసి రావాలంటే కొన్నింటిని ఇంట్లో ఉంచుకోవాలని చెబుతున్నారు పండితులు. లక్ష్మీదేవి కటాక్షం కలిగించే వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వాటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని తద్వారా అదృష్టాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. మరి అవేమిటో తెలుసుకుందామా..?
నమ్మకం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. కష్టపడితే ఫలితం వస్తుందని నమ్ముతాం. కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే మరీ మంచిది. మరి అటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులేంటో చూద్దాం.. కొత్త సంవత్సరం వస్తే ఏదొకటి కొనటం చాలామందికి అలవాటు. కొత్త ఇంటిలోకి ఏమేమి కొనాలా?అని ఆలోచిస్తుంటారు చాలా మంది. ఏవి ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది?అని ఆలోచిస్తారు.
కొబ్బరి శుభ సూచకం (cobonut): అదృష్టాన్ని తెచ్చే వస్తువులేమిటంటే..కొబ్బరిని తెచ్చుకోవటం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. ఎండు కొబ్బరి కానీ, పచ్చికొబ్బరి లేదా కొబ్బరి బోండాం ఏదైనా సరే లక్ష్మీ ప్రతీక. అందుకే మన పూజల్లో కొబ్బరికాయ కొబ్బరి బోండాం ప్రధానంగా ఉంటాయి. కొబ్బరి కాయకు ప్రత్యేకస్థానం ఉంటుంది శుభకార్యాల్లో. కొబ్బరి కాయ కొట్టకుండా పూజ పూర్తికాదు. చిన్న ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
తులసి మొక్క (tulasi plant): మన సంప్రదాయంలో పురాణాల్లో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి మొక్క పవిత్రమైంది మాత్రమే కాదు, ఔషధాలు గని కలిగిన అద్భుతమైనర మొక్క కూడా. తులసి ఉన్న ఇల్లు ఆరోగ్యంతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగుతుందని ప్రతీతి. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపం అని శాస్త్రం చెబుతోంది. తులసిని వాకిట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవినిని ఆహ్వానించినట్లే.
తాబేలు బొమ్మ (Turtle ): తాబేలు ప్రతిమ సుఖశాంతులకు ప్రతీక అని వాస్తు శాస్త్రం చెబుతోంది. లోహపు తాబేలును ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందట. తాబేలు ప్రతిమ వల్ల ఆలస్యమైన పనులు..పెండింగ్ లో ఉన్న పనులు కూడా చకచకా జరిగిపోతాయట. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటిలో ఉంచుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో తాబేలు బొమ్మ గల ఉంగరాలను ధరించటం చేస్తున్నారు.
ముత్యపు చిప్ప (pearl shell) : ముత్యపు చిప్ప సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ దేవి మెడలో ముత్యాల హారం ఉంటుంది.ముత్యాలు కూడా సముద్ర గర్భం నుంచి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవట. ముత్యపు చిప్ప ఉన్న ఇంట్లో డబ్బులకు కొదువే ఉండదట.
నెమలి ఈకలు (Peacock feathers): నెమలి ఈకలు నెమలి ఈకలు అంటే శ్రీకృష్ణుడు ఠక్కున గుర్తుకొస్తాడు. శిఖపించ మౌళి అంటారు నెమలి ఈకలను అలంకారంగా ధరించిన కిట్టయ్యని. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుని కి చాలా ఇష్టం. నెమలి పించాన్ని తలమీద ధరించేవాడు. నెమలి పింఛం ఉన్నచోట లక్ష్మీ అమ్మవారు ఉంటారని పండితులు చెబుతున్నారు.