Bikkavolu Ganesh : వినాయకుడి చెవిలో చెబితే కోర్కెలు నెరవేరుతాయ్… ఎక్కడో తెలుసా!..

తెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీర

Bikkavolu Ganesh : చేతులు జోడించి మనస్సులో కోర్కెలు కోరుకుంటే వాటిని దేవుడు నెరవేరుస్తాడనేది నమ్మకం.. అయితే ఆ దేవాలయంలోని వినాయకుడికి మాత్రం రహస్యంగా చెవులో కోర్కెలు చెప్పాలి. అలా చెప్పిన కోర్కెలను ఆయన ఇట్టే తిర్చేస్తాడని భక్తులు నమ్ముతున్నారు. భక్తుల చేత చెవులో కోర్కెలు చెప్పించుకుంటూ ప్రసిద్ధిగాంచిన ఈ వినాయక దేవస్ధానం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు గ్రామంలో లక్ష్మీ గణపతిగా వినాయక స్వామి కొలువై ఉన్నాడు.

పంచ విశిష్ట గణపతి క్షేత్రాల్లో బిక్కవోలు లక్ష్మీగణపతి క్షేత్రం ఒకటి. స్వయంభూగా ఇక్కడి వినాయకుడు వెలిశాడని పురాణ గాధలు చెబుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని కాణిపాకం, ఐనవల్లి వినాయక ఆలయాల్లాగానే బిక్కవోలు గణపతి ఆలయం ప్రసిద్ధిపొందింది. ఈ ఆలయం క్రీ. శ.9 వ శతాబ్దంలో తూర్పు చాణక్యుల కాలంలో క్రీ. శ.849 మధ్య క్రీ. శ.892 లో నిర్మించారు. ఆతదనంతర నవాబుల పాలనా కాలంలో భూగర్భంలో శిధిలంగా మారిపోయింది.

అతిపెద్ద గణపతి శిలావిగ్రహాల్లో ఇది కూడా ఒకటి. భూమిలోపల ఎంతలోతులో వినాయకుడి విగ్రహం ఉందో అంతుచిక్కని విషయంగా చెప్పవచ్చు. ఇక్కడి గణపతి తొండం తూర్పు దిశగా తిరిగి ఉంటుంది. నాగా భరణం, నాగయజ్నోపవీతం, నాగ మొలతాడు, బిళ్ళ కట్టు పంచకట్టుతో సుఖాసనంలో ఆశీనుడై వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. 19వ శతాబ్ధంలో ఓ భక్తుడి కలలో కనిపించి తన ఉనికిని చాటినట్లు ఓ కధ ప్రచారంలో ఉంది. భక్తుడు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేయటంతో భూమిలోపల ఉన్న వినాయకుని విగ్రహాన్ని తదనంతరకాలంలో పైకి పెరిగినట్లు ప్రచారం జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల నుండి ఈ బిక్కవోలు వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మనస్సులో అనుకున్న కోర్కెలను స్వామి చెవులో చెప్పి ముడుపు కడితే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వసిస్తుంటారు. భక్తులు చెప్పే కోర్కెలు ధర్మంగా ఉంటే మాత్రమే నెరవేరుతాయట. అధర్మమైన కోర్కెలను స్వామి ఏమాత్రం తీర్చడని పండితులు చెబుతున్నారు.

ప్రతి సంవత్సరం బిక్కవోలు గణపతి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలతోపాటు, సుబ్రమణ్యేశ్వర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ గణపతి హోమం చేయించుకుంటే మంచిదని భక్తులు భావిస్తారు. గణపతి నవరాత్రుల సమయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివస్తుంటారు.

ప్రతి నెలా శుద్ధ చవితి నాడు లక్ష దూర్వ బిలాలతోపూజ, మూల మంత్ర జప తర్పణ హోమాలు, అభిషేకాలు, ఏకా దశ, గణపతి,రుద్ర, చండి హోమాలు చేస్తారు. ఈ ప్రాంగణంలో ఇంకా రాజరాజేశ్వరీ చంద్రశేఖర, గొలింగేశ్వర, పార్వతి, సుబ్రమణ్య స్వామి,నంది, నవ గ్రహాలు కొలువై ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడల నుండి ఈ బిక్కవోలు గణపతి ఆలయానికి చేరుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు