Indrakeeladri Temple (Image Credit To Original Source)
Indrakeeladri Temple: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మ వారి ఆలయంలో అంతరాలయ దర్శనాలపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం, సెలవు దినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అంతరాలయ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Also Read: పౌరుషం చూపించాల్సింది నా మీద కాదు, వారి మీద..: జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి కౌంటర్
దేవాదాయ కమిషనర్ రాంచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆయా వేళల్లో అంతరాలయ దర్శనాలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు క్లూ లైన్‌లో గంటల తరబడి వేచి ఉండకుండా వారికి వేగంగా దర్శనం కల్పిస్తామన్నాని శీనా నాయక్ తెలిపారు. వీఐపీలు ఈ మార్పును గమనించి దేవస్థానం సిబ్బందితో సహకరించాలని అన్నారు.