Brahma Kamal
Brahma Kamal : బ్రహ్మ కమలాలను అరుదైన పుష్పాలు అంటారు. ఎవరింట్లో అయినా ఇవి పూస్తే చాలా సంతోష పడతారు. అదృష్టంగా కూడా భావిస్తారు. ఈ బ్రహ్మ కమలాల విశిష్టత ఏంటి? ఇవి వికసించడం వెనుక సంకేతాలు ఏంటి?
Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు
బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో కనిపించే అరుదైన పుష్పించే మొక్క. వర్షాకాలం మొదలయ్యాక ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్య వరకూ ఈ పువ్వులు పూస్తాయి. మొగ్గ తొడిగిన తర్వాత రెండు మూడు వారాలకు బ్రహ్మ కమలం వికసిస్తుంది. అయితే ఈ పుష్పాలు రాత్రపూట మాత్రమే వికసిస్తాయి. వీటి నుంచి వచ్చే పరిమళాలు ఆహ్లాదకరంగా ఉంటాయి.
చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతారు. అది సరిగా పెరగనట్లైతే తగిన సూర్యరశ్మి అందట్లేదని నిర్ధారించుకోండి. వెంటనే దాని స్ధానాన్ని మార్చాలి. అయితే తూర్పు, ఆగ్నేయం, వాయవ్య దిశలో ఈ మొక్కను ఉంచడం చాలా మంచిదని చెబుతారు. ఎవరింట్లో అయితే బ్రహ్మ కమలం వికసిస్తుందో అప్పటి వరకూ వారింట్లో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి సంకేతంగా చెబుతారు. పెళ్లికాని వారు బ్రహ్మ కమలాలతో అమ్మవారికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట. అలాగే డిప్రెషన్‌లో ఉన్నవారు పూజించినా ఆరోగ్యవంతులవుతారట.
బ్రహ్మ కమలం రాత్రి పూట వికసిస్తుంది. అయితే ఆ సమయంలో దానిని కోసి పూజలో పెట్టవచ్చునా? అనే అనుమానం చాలామందిలో ఉంటుంది. ఆ సమయంలో పూజలో పెట్టవచ్చని చెబుతున్నారు. బ్రహ్మ కమలాలు ఎక్కువ వికసిస్తూ ఇతరులకు వాటిని పంచితే ఎంతో మంచిదట. ఒక్కోసారి ఏ మొక్కలను నాటినా ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకు అనుకూల నక్షత్రంలో వాటిని నాటకపోవడమే కారణమట. చెట్లను సోమవారంనాడు రోహిణి నక్షత్రంలో నాటితే మంచి పంట వస్తుందట. ఔషధ మొక్కలను అశ్వనీ నక్షత్రంలో నాటడం మంచిదట.