Koil Alwar Thirumanjanam : తిరుచానూరులో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు, న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌

Koil Alwar Thirumanjanam : తిరుచానూరులో రేపు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Koil Alwar Tirumanjanam

Updated On : November 22, 2021 / 2:47 PM IST

Koil Alwar Thirumanjanam :  తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో రేపు, న‌వంబ‌రు 23వ తేదీ మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌న, శుధ్ధి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం గం.6 నుండి గం.9ల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు.
Also Read : Kerala : బలవంతపెట్టి లైంగిక సంబంధం పెట్టుకుంటే అత్యాచారమే..కేరళ హైకోర్టు కీలక తీర్పు
అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.