Maha Kumbh Mela 2025 : మహాకుంభమేళ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా..? ప్రయాగ్‌రాజ్ నుంచి 24 గంటల విమాన సర్వీసులు..!

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్ నుంచి 23 నగరాలకు ప్రయాణీకులు ప్రయాణించగలరు. ప్రతిరోజూ 60కి పైగా విమానాలు రానున్నాయి.

Maha Kumbh 2025

Maha Kumbh Mela 2025 : కొత్త ఏడాది, మహా కుంభమేళా పురష్కరించుకొని అయోధ్య ముస్తాబవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో త్వరలో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈ మహాకుంభమేళా సమయంలో భక్తుల సౌకర్యార్థం త్వరలో కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా, ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు విమానాలను నడిపేందుకు అనుమతి కోరింది.

ఇండిగో, ఆకాస, అలయన్స్ ఎయిర్ వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ నుంచి విమానాలను నడుపుతున్నాయి. విమానాల సంఖ్యను పెంచడం వల్ల భక్తులకు సౌకర్యం కలుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 44 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు.

Read Also : 2025 January Bank Holidays : 2025 జనవరిలో ఏయే తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయంటే? ఫుల్ లిస్టు ఇదిగో..!

మహా కుంభానికి విమాన సర్వీసులతో పాటు హెలికాప్టర్ సర్వీసులను కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్ సంగం నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించాలని పవన్ హన్స్ కంపెనీ ప్రతిపాదించింది. లాజిస్టిక్స్‌పై చర్చించేందుకు కంపెనీ అధికారులు ఇప్పటికే జిల్లా యంత్రాంగంతో సమావేశమయ్యారు.

ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌ఫోర్టు నుంచి 24 గంటల విమాన సౌకర్యం :
మహా కుంభమేళా సమయంలో ప్రయాగ్‌రాజ్ నుంచి 23 నగరాలకు ప్రయాణీకులు ప్రయాణించగలరు. ప్రతిరోజూ 60కి పైగా విమానాలు రానున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి 24 గంటలపాటు విమానాలను నడిపేందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. ఇక్కడ క్యాట్-II లైట్లు అమర్చారు. తద్వారా రాత్రిపూట పొగమంచు ఉన్నప్పటికీ విమానాల ఆపరేషన్ సాఫీగా సాగుతుంది.

4 విమానయాన సంస్థలు షెడ్యూల్‌ విడుదల :
మహా కుంభమేళా సందర్భంగా 4 విమానయాన సంస్థలు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసుల టైమ్‌టేబుల్‌ను కూడా విడుదల చేశాయి. స్పైస్ జెట్ విమాన సర్వీసులు జనవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీకి కూడా కంపెనీ బుకింగ్ ప్రారంభించింది.

అలయన్స్ ఎయిర్ ఎయిర్‌లైన్ కంపెనీ ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, జబల్‌పూర్, గౌహతి, భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్‌లకు విమానాలను నడుపుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, భువనేశ్వర్, రాయ్‌పూర్, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, భోపాల్, చెన్నైలకు ఇండిగో విమానాలు నడుస్తాయి. ఆకాసా ఎయిర్‌లైన్స్ ముంబైకి విమానాలను నడుపుతోంది. మహాకుంభ్‌లో విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ప్రయాగ్‌రాజ్ నుంచి ఈ నగరాలకు విమాన సర్వీసులు :
ప్రస్తుతం, ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, బిలాస్‌పూర్, లక్నో, రాయ్‌పూర్, భువనేశ్వర్‌లకు విమానాలు నడుస్తున్నాయి. అయితే, జనవరి 10 నుంచి వాటి సంఖ్య మూడు రెట్లు పెరుగుతుంది.

ప్రయాగ్‌రాజ్ నుంచి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, ఇండోర్, భోపాల్, జబల్‌పూర్, జైపూర్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, డెహ్రాడూన్, చండీగఢ్, పూణే, నాగ్‌పూర్, పాట్నా, చెన్నై, గోవా, అమృత్‌సర్ జమ్మూ, అయోధ్య, గోరఖ్‌పూర్‌లకు సాధారణ విమానాలు నడుస్తాయి.

Read Also : Mahakumbh 2025 : జనవరి 13 నుంచి మహాకుంభమేళా జాతర.. ప్రయాగ్‌రాజ్‌లో 40 కోట్ల మంది యాత్రికుల కోసం విస్తృత ఏర్పాట్లు!