Astrology
Astrology : దీపావళి పండుగ రోజు నుంచి పలు రాశుల వారికి అదృష్టం పట్టనుంది. ఈ సంవత్సరం దీపావళి నాడు ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతోంది. ఇది వంద సంవత్సరాల తరువాత ఏర్పడడం విశేషం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి వారి జీవితాల్లో భారీ, సానుకూల మార్పులు రానున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు నిర్ధిష్ట సమయంలో రాశులను మార్చుకుంటూ సంచరిస్తాయి. ఇలా గ్రహాల సంచారం సమయంలో కొన్ని యోగాలు ఏర్పడతాయి. ఈ యోగ ప్రభావం మొత్తం రాశులపై పడుతుంది. అయితే, కొన్ని రాశుల వారికి శుభయోగాలను, మరికొన్ని రాశుల వారికి అశుభాలను కలుగజేస్తాయి. అయితే, ఈ ఏడాది దీపావళి పండుగ నాటి నుంచి ఒక ప్రత్యేకమైన యోగం ఏర్పడబోతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి.. ముఖ్యంగా మూడు రాశుల వారు శుభ ఫలితాలు పొందనున్నారు.
Also Read: పూజలు చేసినా మీ కాలసర్ప దోషం పోవడం లేదా? నిజమైన రెమెడీస్ ఇవే.. ఇలా చేశారంటే మీకు పట్టిన దరిద్రమంతా..
దీపావళి రోజున నవగ్రహాల్లో ఒక గ్రహం అయిన దేవతల గురువు బృహస్పతి కర్కాటకంలో తిరోగమనం చెందనున్నాడు. కర్కాటక రాశి గురువు సొంత రాశి. ఈ రాశిలో గురువు తిరోగమనం చెందడంతో అక్టోబర్ 20వ తేదీ (దీపావళి రోజు)న హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. (హంస మహాపురుష రాజయోగం అనేది దేవగురు బృహస్పతి తన సొంత రాశుల్లో (ధనస్సు, మీనం, కర్కాటకం) ఉన్నప్పుడు ఏర్పడే అత్యంత శుభప్రదమైన, శక్తివంతమైన జ్యోతిష్య యోగం) ఇలా గురువు సొంత రాశిలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి : తులా రాశి వారికి దీపావళి రోజున ఏర్పడే యోగం అన్ని విధాలా కలిసివస్తుంది. ఇచ్చిన ఎటువంటి బాధ్యతలనైనా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. ఆర్థికంగా లాభాలను పొందుతారు. వైవాహిక జీవితంలో విబేధాలు తొలగి సుఖ సంతోషాలతో ఉంటారు. పెళ్లికాని వారి పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : కర్కాటక రాశికి చెందిన వ్యక్తులు గురువు తిరోగమనంతో ఏర్పడే హంస మహాపురుష రాజయోగం శుభ ఫలితాలు ఇస్తుంది. వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతి పనిని పూర్తిచేస్తారు. పెళ్లికాని యువతీ యువకుల పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు సంపూర్ణంగా పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు గౌరవమర్యాదలు పెరుగుతాయి.
వృశ్చిక రాశి : వృశ్చిక రాసి వారికి హంస మహాపురుష యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికత యాత్రలను చేస్తారు. ఆగిపోయిన పనులు మళ్లీ మొదలు పెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.