శబరిమల అయ్యప్ప భక్తులకు కొత్త మార్గదర్శకాలు

  • Publish Date - November 15, 2020 / 05:30 PM IST

New guide lines issued for sabarimala devotees : కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమలలో రేపటి నుంచి (16-11-20) మండల పూజ కార్యకమం ప్రారంభం కానున్నది. ఈ మండల పూజ డిసెంబర్ 26 వరకు జరగనున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు విడుదల చేసింది.

ఆ మార్గదర్శకాల్లో భాగంగానే వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకున్న భక్తులను మాత్రమే స్వామి దర్శనానికి అనుమతిస్తారు. రిజిష్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. లేనివారిని వారంలో ఐదు రోజులు రోజూ 1,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం మాత్రం 2,000 చొప్పున భక్తుల్ని అనుమటించనున్నారు.


ఇక మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దర్శనానికి 5,000 మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్స్ బుక్ అయ్యాయి. నవంబర్, జనవరిలో కొన్ని స్లాట్స్ మిగిలే ఉన్నాయి.

2020 నవంబర్ 16 నుంచి 2020 డిసెంబర్ 26 వరకు మండల పూజ, 2020 డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ, 2021 జనవరి 14న మకరవిలక్కు జరుపుకొంటారు. శబరిమలకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అది కూడా శభరిమలకు రావటానికి 24గంటల్లో తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలి. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు తప్పనిసరి.


భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలి. ఇక ఈసారి భక్తులను పంబ నదిలో స్నానాలకు అనుమతించటం లేదు. భక్తులకు స్నానాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేస్తోంది. పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదు.

నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయి. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్‌కు అనుమతి ఇచ్చారు. సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం దేవస్దానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్‌కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయి.



ట్రెండింగ్ వార్తలు