Tridandi
Sri Ramanujacharya Statue : భాగ్యనగరం ఆధ్మాత్మిక రాజధానిగా మారుతున్న మహత్తరఘట్టం సాక్షాత్కారమవుతోంది. మహాక్రతువుతో ముచ్చింతల్ పులకిస్తోంది. ఓం నమో నారాయణాయ…అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. సమతామూర్తి సహస్రాబ్ది సమారోహం రెండోరోజుకు చేరుకుంది. దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విక్కుల ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. శ్రీ రామనుజ సహస్రాబ్ది సమారోహంలో ఇదే అతి కీలకమైన క్రతువు. తాటికొమ్మలు, వెదురుబొంగులతో నిర్మించిన 144 యాగశాలు, 10 వందల 35 హోమకుండాలతో అంతటా ఆధ్యాత్మికత ఆవరించింది.
Read More : WI Series : టీమిండియాలో కరోనా టెన్షన్.. ధవన్ సహా నలుగురికి కరోనా పాజిటివ్..!
శ్రీ లక్ష్మీనారాయణ మహాక్రతువు 11 రోజుల పాటు సాగనుంది. దేశీ ఆవుపాలతో తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యి, హోమ ద్రవ్యాల సువాసనలు భక్తులను మరో లోకంలోకి తీసుకెళ్లనున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో రోజూ రెండుసార్లు యజ్ఞం జరుగుతుంది. సేవాకాలంలో 2022, ఫిబ్రవరి 03వ తేదీ గురువారం రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్ని ఆవాహన కార్యక్రమంతో క్రతువు మొదలయింది. శమి, రావి కర్రలతో అగ్ని మధనం జరిగింది. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు జరిగే ఈ 11 రోజులూ… ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని..రోజూ కోటిసార్లు జపించనున్నారు. దీంతో.. దివ్యక్షేత్రం శ్రీరామనగరం.. నారాయణ మంత్రంతో మార్మోగనుంది.
Read More : Maharashtra : కరోనా టీకాతో కూతురు చనిపోయింది.. రూ. 1000 కోట్లు ఇవ్వాలన్న తండ్రి
సమతాస్ఫూర్తి కేంద్రంలో 144 యాగశాలల నిర్మాణం శాస్త్రోక్తంగా జరిగింది. వాటితో పాటు ప్రధాన యాగశాల నిర్మించారు. నాలుగు దిక్కులలో 36 చొప్పున యాగశాలల సమూహం ఉంటుంది. మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు జరుగుతాయి. మిగతా వాటిలో.. 2 ఇష్టిశాలలతో పాటు సంకల్ప మండపం, అంకురారోపణ మండపం, నిత్యపారాయణ మండపాలున్నాయి. వీటిలో.. వేద, ప్రబంధ, ఇతిహాస పారాయణాలు జరుగుతాయి.