Karthika Masam 2023 : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ .. భక్తులతో పోటెత్తిన శైవ క్షేత్రాలు

శివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చారు. భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని శివకేశవుల ఆలయాలు నిండిపోయాయి.

Karthika Masam In Andhra Pradesh Telangana

Karthika Masam In Andhra Pradesh, Telangana : శివకేశవులకు ప్రీతికరమైన మాసం..కార్తీక మాసం. పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అంటే ..శివకేశవులు ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతుంటాయి. పైగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి, సోమవారం కలిసి రావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించి తెల్లవారిన తరువాత శైవ క్షేత్రాలకు భారీగా తరలివచ్చారు. భక్తులతో తెలుగు రాష్ట్రాల్లోని శివకేశవుల ఆలయాలు నిండిపోయాయి.

పవిత్రమైన కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాలైన భీమవరంలోని శ్రీ సోమేశ్వర స్వామి వారు శ్వేత వర్ణంలో దర్శనం ఇస్తుండటంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పాలకొల్లులోని శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి ఒడ్డునే ఉన్న కొవ్వూరు లోని గోష్పాద క్షేత్రంలో కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజామున గోదావరీ నదిలో దీపాలు వదిలి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నరసాపురంలోని గోదావరిలో భక్తులు అరటి దోప్పలల్లో దీపాలు వదిలి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

అప్పన్న సేవలో భక్తులు..రత్నగిరి ప్రదక్షిణలో భక్తులు..
కార్తీకమాసం రెండవ సోమవారం కావటంతో అన్నవరంలోని రత్నగిరిపై వెలసిన అప్పన్నను భక్తులు దర్శించుకున్నారు.తెల్లవారుజామున 3 గంటల నుండి సత్యదేవుని సన్నిధిలో వ్రతాలు సర్వదర్శనాలు ప్రారంభమయ్యాయి. పవిత్ర కార్తీక మాసం కావటంతో స్వామివారి వ్రతం, దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు.కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 8 గంటలకు సత్యదేవుని గిరిప్రదక్షిణ ప్రారంభమైంది.11 కిలోమీటర్ల రత్నగిరి ప్రదిక్షణలో భక్తులు తరించారు. సత్యగిరి, కొండల చుట్టూ సాగనున్న గిరిప్రదక్షిణతో స్వామివారి నామస్మరణతో మారుమోగిపోతున్నాయి.

కార్తిక పౌర్ణమి సందర్బంగా చీరాలలో శివాలయాలకు భక్తులు పోటెత్తారు.పేరాల పునుగురామలింగేశ్వరస్వామి,చీరాల మల్లేశ్వరస్వామి అలయాల్లో పంచామృతలతో అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు.చీరాల మండలం వాడరేవు, రామపురం, పొట్టిసుబ్బయ్యపాలెం తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు అచరించి స్వామివార్లను దర్శిచుకున్నారు.సముద్రంతీరంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.అవాంచనీయ ఘటనలు చోటుచేసుకొకుండా పోలీసులు బందొబస్తు నిర్వహించారు.

రాజన్న సేవలో భక్తులు..
కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం తెల్లవారుజామునుంచి తరలి వస్తునన భక్తులతో నిండిపోయింది. అలాగే గోదావరి నదీ తీరంలో వెలసని రామయ్య సన్నిథి అయిన భద్రాచలంలో కూడా భక్తులు పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో కార్తీక దీపాలు వదిలి భద్రాచల రాముడ్ని దర్శించుకున్నారు.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గోదావరీ నదీ తీరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా భక్తుల సందడితో నిండిపోయింది. ఆధ్మాత్మిక భావనలతో తరిస్తోంది. పవిత్ర గోదావరి నదీ తీరాల్లోని రామాలయం, శివాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో కార్తీకదీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు