Mystery Temple : ఈ గుడిలో దైవాన్ని చూస్తే కళ్లుపోతాయట .. పూజారులు కూడా కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే..

ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి. లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట.

Latu Mysterious Temple

Latu Temple in India Mysterious Temple : ఏ దేవాలయానికి వెళ్లినా ఆ ఆలయంలో కొలువైన దేవుడిని కళ్లారా దర్శించుకుంటాం. దేవుడికి దణంపెట్టుకునే సమయంలో కళ్లు మూసుకుంటాం. కానీ ఓ దేవాలంయలో మాత్రం దేవతను కళ్లతో చూడకుండానే దర్శించుకోవాలి. భక్తులు ఆదేవాలయంలోకి అడుగు పెట్టాలంటే కళ్లు మూసుకోవటం మాత్రమే కాదు కళ్లకు గంతలు కట్టుకోవాలి. ఏమాత్రం కంటికి ఏమాత్రం ఏదీ కనిపించుకుండా గంతలు కట్టుకోవాలి. ఆ దేవాలయంలో భక్తులే కాదు..పూజలు చేసే పూజారి కూడా కళ్లకు గంతలు కట్టుకోవాలి. మరి కళ్లకు గంతలు కట్టుకునేలా అయితే ఇక దర్శనం జరిగినట్లు ఎలా అవుతుంది..?అనే పెద్ద సందేహం వచ్చి తీరుతుంది. కానీ ఆ దేవాలయం ప్రత్యేకత అదే.అదే రహస్యం.

భారతదేశంలో ఎన్నో అత్యద్భుతమైన మిస్టరీ దేవాలయాలున్నాయి. అటువంటిదే ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని పురాతన దేవాలయం బాన్ అనే గ్రామంలో ఉంది. హిందూ సంప్రదాయంలో ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ నమ్మకాల ప్రకారం ఏర్పడ్డవే.. అలా అనేక దేవాలయాల్లో రకరకాల ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు  కొనసాగుతున్నాయి. దేశంలోని కొన్ని ఆలయాల్లో నిగూఢమైన, భయానక రహస్యాలు కూడా ఉన్నాయని చరిత్ర చెబుతోంది. అటువంటిదే ఈ మిస్టరీ దేవాలయం.

Varalakshmi Vratham 2023 : చారుమతికి కరుణించిన వరలక్ష్మీదేవి .. ఎవరీ చారుమతి..?ఆమెకు అమ్మవారు ఇచ్చిన వరాలేంటో తెలుసా..

బాన్ గ్రామంలోని లాతు మందిరంలో అనేక సంవత్సరాలుగా ఈ విచిత్రమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఆలయంలో దైవాన్ని కళ్లకు గంతలు కట్టుకుని దర్శించుకోవాలి. లేదంటే కంటి చూపే పోయే ప్రమాదం ఉందట. ఈ ఆలయ పూజారులు కూడా దేవాలయంలో ప్రవేశించే ముందు కళ్లకు గంతలు కట్టుకుంటారు. నోరు కూడా మూసేలా కట్టుకుంటారట. వారి శ్వాస కూడా దైవానికి సోకకూడదట. భక్తులు కూడా దూరం నుంచిే అదికూడా కళ్లకు గంతలు కట్టుకునే దర్శించుకోవాలి. ఈ ఆలయంలో లాతు దేవతను మాత్రమే పూజిస్తారు. ఇక్కడి లాతు దేవతను ఉత్తరాఖాండ్‌లోని నందా దేవిని మతపరమైన సోదరిగా పరిగణిస్తారు. ఆ మాతను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.

లాతు దేవాలయంలో నాగరాజు తన విలువైన రత్నంతో నివసిస్తూ ఉంటాడు. ఏ వ్యక్తి అయినా ఈ రత్నం ప్రకాశవంతమైన కాంతిని చూస్తే అంధుడు అవుతాడని..అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి కేకలు వేస్తారని నమ్మకం. అదే నేటికి కొనసాగుతోంది. అందుకే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు పూజారులు తమ భక్తుల కళ్లకు, నోటికి గంతలు కట్టుకుంటారు. దీని వల్ల రత్నం యొక్క ప్రకాశవంతమైన కాంతి నుంచి భక్తులకు రక్షణ లభిస్తుందని నమ్ముతారు.

ఈ ఆలయం కేవలం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు మాత్రమే తెరచుకుంటుంది. ఆ సమయంలో భక్తులందరూ దూరం నుంచే భగవంతుడిని దర్శనం చేసుకుంటారు. అదే విధంగా ఆలయ అర్చకులు అందరికీ కళ్లు మూసి, వారు కూడా కళ్లకు గంతలు కట్టుకుని పూజలు చేస్తారు. అమావాస్య రోజున ఈ ఆలయం తలుపులు మూసేస్తారు. ఎన్నో రహస్యాలు ఈ దేవాలయం సొంతం. నియమాలను పాటించటం తప్ప ప్రశ్నించకూడదనే నమ్మకంతో భక్తులు, పూజారులు అదే నియమాన్ని పాటిస్తున్నారు. పాత సంప్రదాయాలను అనుసరిస్తున్నారు.

Sri Garbarakshambigai : గర్భిణులకు రక్షణగా ఉండే జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం గురించి తెలుసా..?

కాగా ఇది దేవత ఆలయం అయినప్పటికీ నాగరాజు విలువైన రత్నం కోసం ఇక్కడే వేచి ఉన్నాడని పురాణాలు చెబుతున్న కథనం. మత విశ్వాసాలపై ఆధారపడి కొనసాగే ఇటువంటి నమ్మకాలు, రహస్యాలు కేవలం ఊహాలే అని కొట్టిపారేయలేం. కొంతమంది మాత్రం అవన్నీ ట్రాష్ అంటారు. దీనికి సంబంధించి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు ఉన్నా లేకపోయినా..మనిషి చేధించలేని ఎన్నో రహస్యాలు ఈనాటికి ఉన్నాయి. అవన్నీ మనిషి మేథస్సుకు అందని ఓ మానవతీత శక్తులేనని నమ్మకం. అలా స్థానికంగా ఉన్న నమ్మకాలు, ఆచారాలను బట్టి ఈ సమాచారాన్ని అందిస్తున్నామని గమనించగలరు.

ఉత్తరాఖండ్ ప్రధాన దేవత నందా దేవి సోదరునిగా నమ్మబడే లాతు దేవతకు అంకితం చేయబడింది. శ్రీ నందా దేవి యొక్క పవిత్ర ఊరేగింపు ప్రతి 12 సంవత్సరాలకు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, హేమకుండ్ వరకు జరిగే ఈ ప్రయాణంలో లాతు దేవత నందా దేవిని స్వాగతించిందట. అతనితో కలిసి ఉంటుంది. పాముల రాజు ‘నాగ మణి’గా ప్రసిద్ధి చెందిన అతని అత్యంత విలువైన రత్నంతో పాటు ఇక్కడ నివాసం ఉంటాడని నమ్ముతారు. భక్తులను ఆలయంలోకి అనుమతించరు. ఆలయ ద్వారం నుండి 75 అడుగుల దూరంలో వారు దర్శించుకోవాలి..నైవేద్యాలను సమర్పించుకోవాలి.

ఈ ఆలయం పురాణ కథ..ఓ సారి మత్తులో ఉండి విధ్వంసం సృష్టించిన ఆమె సోదరుడు లాతు దేవతకు పార్వతి దేవి లేదా నందా దేవి శిక్ష విధించిందని చెబుతారు. అతన్ని ఈ స్థలంలో బందీని చేశారట.అలా లాతు దేవతా దేవాలయం తలుపులు సంవత్సరం పొడవునా మూసి ఉంటుంది. ఆలయం తలుపు తెరిచినప్పుడు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే అంటే వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు పూజారి కళ్లకు గంతలు కట్టుకుని మాత్రమే ఆలయంలోకి ప్రవేశించి పూజలు చేస్తారు. పవిత్ర గ్రంథాన్ని జపిస్తున్నప్పుడు పూజారి శ్వాస వల్ల కూడా దేవత భంగం చెందకుండా అతను తన నోటిని గుడ్డతో కప్పుకోవాలి. గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవతగా భావిస్తారు. భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు.