Bhishma Ekadashi : భీష్మ ఏకాదశి అంటే ఏమిటి? విశిష్టత ఏంటి? ఆ రోజున ఏం చేయాలి? ప్రధానంగా పిండ ప్రదానం ఎవరు చేయాలి? ఎవరు చేస్తే శుభం జరుగుతుంది? ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష్య పండితులు సుద్దపల్లి నాగరాజు మాటల్లో తెలుసుకుందాం..
స్వచ్చంద మరణాన్ని వరంగా పొంది ఉండటం వల్ల..
”ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో మాఘమాసం శుక్లపక్షం 11వ రోజున ఏకాదశి అంటారు. ఈ రోజున భీష్మ పితామహులు స్వచ్చంద మరణాన్ని వరంగా పొంది ఉండటం వల్ల ఈ మాఘమాసం శుక్షపక్ష ఏకాదశి రోజున ప్రాణాలను త్యాగం చేశారు. స్వచ్చంద మరణం ఆయనకు వరం. ఈ వరాన్ని తన తండ్రి సంతన మహారాజు నుంచి ఆయన పొందారు.
Also Read : శని ‘సడేసతి’ వస్తోంది.. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఏ పరిహారం చేయాలంటే?
ధర్మాన్ని బోధించి భీష్మాచార్యుడిగా ఉంటారు..
అంపశయనం మీద ఉండి కూడా ధర్మరాజుకు ఎన్నో ధర్మ సందేహాలు వదిలిచ్చారు భీష్ముడు. కాబట్టి ఆయన కూడా ఆచార్యుడే. గీతను బోధించి కృష్ణుడు గీతాచార్యుడు అయినట్లు భీష్ముడు కూడా ధర్మాన్ని బోధించి భీష్మాచార్యుడిగా ఉంటారు.
దేశంలో ఉన్న పిల్లలంతా ఆయన పిల్లలే..
భీష్ముడికి పిల్లలు లేరు. దేశంలో ఉన్న పిల్లలంతా ఆయన పిల్లలే. కాబట్టి భీష్మ ఏకాదశి రోజున తప్పకుండా అందరూ వారి శక్తి మేరకు భీష్ముడికి పిండ ప్రదానం చేయడం ద్వారా సకల శుభాలు పొందుతారు.
తల్లిదండ్రులు ఉన్న వారు కూడా పిండ ప్రధానం బీష్ముడికి చేయొచ్చు..
తల్లిదండ్రులు ఉన్న వారు పిండ ప్రదానం చేయొచ్చా అనే సందేహం అందరికీ వస్తుంది. తల్లిదండ్రులు ఉన్న వారిని పిండ ప్రదానం చేయనివ్వరు కదా అనే డౌట్ వస్తుంది. తల్లిదండ్రులు ఉన్న వారు కూడా పిండ ప్రధానం బీష్ముడికి చేయొచ్చు. ఎందుకంటే భీష్మ పితామహుడికి మనం అందరం పిల్లలమే.
5వేల సంవత్సరాలకు ముందు.. భారత దేశంలో పుట్టిన వారందరికీ ఆయన తాతే అవుతారు. ఆయనకు మనమందరం మనవళ్లుగా తప్పకుండా పిండ ప్రదానం చేయొచ్చు. ఇచ్చిన మాటను తప్పకుండా, ధర్మాన్ని దాటకుండా ఇలా బతకాలి అని భవిష్యత్తు తరాలకు గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి భీష్ముడు” అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, జ్యోతిష్య పండితులు సుద్దపల్లి నాగరాజు అన్నారు.
పితృదోషాలు తొలగిపోతాయి..
”భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి పిండ ప్రదానం చేయడం ద్వారా పిత్రు దోషాల తొలగిపోతాయి. పిండ ప్రదానం అందరూ చేయవచ్చు. భీష్మాచార్యులకు మనమందరం పిల్లలమే. తల్లిదండ్రులు ఉన్న వారు కూడా పిండ ప్రదానం చేయొచ్చు. పిండ ప్రదానం చేయలేని వాళ్లు విష్ణు సహస్ర నామాన్ని చదువుకున్నా, భీష్ముడిని మనసులో తలచినా మంచి ఫలితం లభిస్తుంది. పిత్రు దోషం అంటే సంతానం ఉండదు. పూర్వీకుల ఆస్తిని అనుభవించ లేరు.
అలాంటి వారందరికి ఆ సమస్యల నుంచి విముక్తి పొందటానికి భీష్మ ఏకాదశి గొప్ప పర్వదినం. అనుకోని అవకాశం. అందరూ దాన్ని ఉపయోగించుకోవచ్చు. సత్ఫలితాలు పొందరుతారు. సంతానం లేని వారు, పిత్రు దోషాలు ఉన్న వారంతా తప్పకు చేసుకోవచ్చు. డబ్బు ఉన్నా మనశ్శాంతి లేని వారు కూడా భీష్మ ఏకాదశి పర్వదినాన పిండ ప్రదానం చేస్తే శుభం కలుగుతుంది. భీష్మ ఏకాదశిని పాటించడం వల్ల పిత్రు దోషాలు తొలగుతాయి” అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు సుద్దపల్లి నాగరాజు తెలిపారు.