Sravanam : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ, వరలక్ష్మీకి మహిళల ప్రత్యేక పూజలు

శ్రావణమాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రధాన క్యూలైన్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

Varalakshmi Pooja : తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ నెలకొంది. ఏ ఆలయాన్ని చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి…వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటుంటారు. దీంతో వ్రతానికి కావాల్సిన సరుకులు తీసుకరావడానికి జనాలు రోడ్డెక్కడంతో మార్కెట్లు సందడి సందడిగా మారాయి. ఇదే అదనుగా..పూలు, పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ…భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ పూజరాలు..పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు.

ఈ సందర్భంగా..ఆలయాలను పూలతో అందంగా అలంకరించారు. సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నారు. ప్రతింటిలో వరలక్ష్మీ విగ్రహాలను ఏర్పాటు చేసి మహిళలు పూజలు చేస్తున్నారు. తొమ్మిది రకాల పిండి వంటలు చేసి ప్రసాదంగా సమర్పిస్తున్నారు. ముత్తయిదువులను ఇంటికి పిలిచి..వాయనాలు ఇస్తున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం, శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ప్రధాన క్యూలైన్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

కనకదుర్గమ్మ శ్రీ వరలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణమాసంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. మరోవైపు వరలక్ష్మీ దేవిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే అమ్మవారి దర్శనార్ధం వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని దుర్గగుడి అధికారుల ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని అష్టలక్ష్మీ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు కరోనా నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు