Sri Garbarakshambigai : గర్భిణులకు రక్షణగా ఉండే జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం గురించి తెలుసా..?

గర్భంతో ఉన్నవారిని నిరంతరం కాపాడే అమ్మవారు. ఆ జగన్మాతే కదిలి వచ్చి కడుపులో బిడ్డకు ప్రాణం పోసి..సుఖ ప్రసవాన్ని ఇచ్చిన పుణ్యక్షేత్రం..

Sri Garbarakshambigai Temple

Sri Garbarakshambigai Temple : ముగ్గురు అమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఆ అమ్మ ఎన్ని అవతారాలు ఎత్తినా ఏ పేరుతో పిలిచినా..పలికే అమ్మ. భక్తితో నిండు మనస్సుతో కొలిస్తే కోరిన కోరికలు తీర్చే వెన్నలాంటి మనస్సున్న అమ్మ. మరి ఆమె ఆడబిడ్డలకు కష్టం వస్తే సాక్షాత్తు ఆ జగన్మాతే కదిలి వచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఓ విశిష్ట ప్రదేశం. జగన్మాత అంటే ఈ జగానికే మాత. ఈ జగత్తులో మానవ పుట్టుకకు మూలం స్త్రీ. అటువంటి స్త్రీ గర్భం ధరిస్తే ఆ గర్భాన్ని కాపాడటానికి వచ్చిన పవిత్ర్ పుణ్యక్షేత్రం ఒకటి ఉంది. గర్భిణికి రక్షణగా ఉండటానికి కదిలి వచ్చిన జగన్మాత కొలువైన పుణ్యక్షేత్రం ‘గర్భరక్షాంబిక’ (Garbarakshambigai) దేవాలయం.

మహిళామూర్తులకు సుఖ ప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే ‘గర్భరక్షాంబిక’ (Garbarakshambigai) అమ్మవారుగా భూమిపై అవతరించింది. దేవాలయాలకు ప్రసిద్దిగాంచిన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుకరుకావుర్‌లో వెలసిన మాత ‘గర్భరక్షాంబిక’ అమ్మవారు. ఆ అమ్మ మహిమలు అనంతం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అమ్మను మొక్కుకుంటే సుఖ ప్రసవం జరిగి తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉంటారన్న భక్తులు నమ్ముతుంటారు. ఈ ఈ నమ్మకం వెనుక వేల ఏళ్ల చరిత్ర ఉంది.

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

రుషి శాపం..రక్షించటానికి కదలి వచ్చిన అమ్మవారు..
స్థలపురాణం ప్రకారం నిరుతవర్‌ అనే పేరుగా రుషి పుంగవుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు వేదిక. ఆయన తన భార్యతో కలిసి వెన్నూరు నది పక్కన నివసించేవారు. (ఈ నది తమిళనాడులోని తంజావూరు , తిరువారూర్ , మరియు నాగపట్నం జిల్లాల గుండా ప్రవహిస్తుంది). నిరుతవర్ భార్య వేదిక గర్భంతో ఉంది. ఓరోజు నిరుతవర్‌ లేని సమయంలో ఒర్తువపతర్‌ అనే రుషి భోజనం కోసం వారి ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి ఇంట్లో ఆహారం సిద్ధంగా లేదు. దీంతో వేదిక రుషి కోసం ఆహారం తయారు చేసి తేవటంలో ఆలస్యమైంది. దీంతో ఒర్తువపతన్ రుషికి కోపం వచ్చింది. దీంతో గర్భంతో ఉందనే విచక్షణ కూడా మరచి వేదికను గర్భం ప్రాణాలతో ఉండదని శపించాడు. ఆ శాపం విన్న వేదిక వణికిపోయింది. కడుపులో బిడ్డ చనిపోయింది. రుషి శాపానికి తిరుగు ఉండదని తెలిసి ఇక అమ్మవారే తనను తన బిడ్డను రక్షిస్తుందని అమ్మను వేడుకుంది. కడుపులో బిడ్డ చనిపోయాడు.

Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు

వేదిక ప్రార్థనకు అమ్మవారి మనస్సు మాతృహదయం తల్లడిల్లిపోయింది. అలా కదలి వచ్చిన ఆ అమ్మ గర్భరక్షాంబిక (Garbarakshambigai) మాతగా ప్రత్యక్షమైన గర్భానికి ప్రాణం పోసింది. అమ్మవారి కరుణాకటాక్షాలతో వేదిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం, ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం (Sri Garbarakshambigai Temple) పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లైవననాధర్‌గా భక్తులకు దర్శనమిస్తుంటారు.  ఈ ఆలయాన్ని చోళులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను చాటి చెబుతున్నాయి. 275 శైవక్షేత్రాల్లో ఇది ఒకటని తెలుస్తోంది.

ఇలా వెళ్లొచ్చు..

తంజావూర్‌ జిల్లాలోని కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ దేవాలయం. అక్కడి నుంచి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. అదే రైలులో చేరుకోవాలంటే పాపనాశనం స్టేషన్‌లో దిగాలి. ఇక్కడ నుంచి ఆలయం 6 కి.మీ.దూరం ఉంటుంది.

కుంభకోణంలో 14 దర్శనీయ దేవాలయాలు..
కాగా కుంభకోణంలో కూడా ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. 14 ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి కుంభకోణంలో. కాశీ విశ్వనాథర్ ఆలయం, ఆది కుంభేశ్వర స్వామి ఆలయం,నాగేశ్వరన్ ఆలయం
చక్రపాణి దేవాలయం,ఐరావతేశ్వర దేవాలయం,సారంగపాణి దేవాలయం,ఉప్పిలియప్పన్ ఆలయం,మహాలింగస్వామి దేవాలయం,రామస్వామి దేవాలయం,ధేనుపురీశ్వర ఆలయం,సూర్యనారాయణ దేవాలయం,కంజనూరు శ్రీ నాగనాథస్వామి దేవాలయం,కల్యాణసుందరేశ్వర ఆలయాలను ప్రధానంగా దర్శించుకోవచ్చు. ఇవన్ని చారిత్రక దేవాలయాలు.

 

ట్రెండింగ్ వార్తలు