శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరిగిన రద్దీ

ఆదివారం హంస వాహన సేవ నిర్వహిస్తారు. సోమవారం మయూర వాహన సేవ..

Srisailam

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుండడంతో మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం కల్పిస్తోంది దేవస్థానం. సాధారణ భక్తులందరినీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.

స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. ఇరుముడి కలిగిన భక్తులకు కూడా ఈ నెల 5న స్వామివారి స్పర్శ దర్శనాలు ముగియనున్నాయి. ఈ నెల 6 నుంచి భక్తులందరినీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తారు. శుక్రవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న ముగుస్తాయి.

ఇవాళ భృంగీ వాహన సేవ నిర్వహించారు. ఆదివారం హంస వాహన సేవ నిర్వహిస్తారు. సోమవారం మయూర వాహన సేవ ఉంటుంది. ఈ నెల 11న అశ్వ వాహన సేవతో పాటు పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

Weather update: భానుడి భగభగ.. 20 రోజులు బయటికి వెళ్లడం కష్టమే..

ట్రెండింగ్ వార్తలు