Weather update: భానుడి భగభగ.. 20 రోజులు బయటికి వెళ్లడం కష్టమే..

ఎండలు, వడగాలులపై ఇంత వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ.. ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పింది.

Weather update: భానుడి భగభగ.. 20 రోజులు బయటికి వెళ్లడం కష్టమే..

Weather update

సూపర్ సోనిక్ రేంజ్ లో సూర్యప్రతాపం, భరించలేనంత స్థాయిలో ఎండ, ఊపిరాడనంత పరిస్థితిలో ఉక్కపోతలు. ఓవరాల్ గా ఈ వేసవి లెక్కలేనంత తిక్కెక్కించబోతుంది. భానుడి భగభగ..పబ్లిక్ ను పరేషాన్ చేయనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గతంలో కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. రోళ్లు పగిలే ఎండలు ఉండబోతున్నాయి.. ఇప్పుడే 37 డిగ్రీల ఎండకొడుతోంది. అది కాస్త 42 డిగ్రీలు దాటనుంది. ఇప్పుడు పగటిపూట అంతోఇంతో బయటికి వెళ్లగల్గుతున్నాం. మరో 20రోజులు అయితే ఇక బయటికి వెళ్లడమే కష్టం. అయినా ఎండలో వెళ్తామంటే ఇక అంతే సంగతులు.

ప్రతిసారి ఇలాగే అంటారు. మేము చూడని ఎండలా.. తిరగని కాలమా. మేము సరదా సరదాకే ఎండలకు తిరుగుతామంటారా ఇక మీ ఇష్టం. మీరు ఎండలను లైట్ తీసుకుంటే..భానుడు మిమ్మల్ని సిక్ చేస్తాడు. బయటి టెంపరేచర్స్ పెరుగుతాయ్.. మీ బాడీ టెంపరేచర్స్ లో మార్పులొస్తాయ్. ఏముందిలే అనుకుంటే మీ హెల్త్ మీ చేతిలో ఉండదు. బాడీలో వాటర్ పర్సంటేజ్ పడిపోయి ఇంటికే పరిమితం అవడం కూడా పక్కానే. కొన్ని సమయాల్లో ప్రొటీన్ లెవల్స్ పడిపోయి.. అవయవాలు పనిచేయకపోవచ్చు కూడా. ఎండైనా, వానైనా పనిచేసేవారి పరిస్థితి ఏంటంటారా. ఎవరైనా ఈ సమ్మర్ లో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే కావాలని అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే.

సీజన్‌తో సంబంధం లేకుండా
వాతావరణం మారుతుంది. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఎండల ప్రభావం స్టార్ట్ అయింది. ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్ లోనే భానుడి భగభగ పీక్ కు చేరుకుంటోంది. రాబోయే రోజుల్లో ఇంకా కష్టమంటోంది ఐఎండీ. రాబోయే రోజుల్లో భానుడి భగభగలతో ఉక్కపోత పెరిగి జనానికి పట్టపగలే చుక్కలు కనిపించే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈసారి సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో టెంపరేచర్స్ అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

సాధారణంగా ఎప్పుడైనా మార్చి నుంచి ఎండలు క్రమక్రమంగా పెరిగి ఏప్రిల్‌, మేలో పీక్‌ స్టేజ్‌కి చేరుకుంటాయి. గతేడాది ఏడాది మేలో కురిసిన వర్షాలతో ఆ సమయంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. అయితే ఈసారి అలా జరిగే పరిస్థితి కనిపించడం లేదంటోంది ఐఎండీ. ఎండల తీవ్రత అంతకంతకూ పెరిగే అవకాశముందని… ఇది ప్రజలను తీవ్ర ఇబ్బంది పరిచే అంశమని చెబుతోంది.

ప్రతి ఏడాది మార్చి తొలివారంలో వేసవికాలానికి సంబంధించి అలర్ట్‌ ఇస్తుంది ఐఎండీ. ఢిల్లీలో పెరిగిన వాయుకాలుష్యంతో రాబోయే రోజుల్లో సాధారణ స్థాయి నుంచి అతి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముంది. రాత్రివేళల్లో ఉక్కపోత విపరీతంగా ఉండే ఛాన్సుంది. ప్రత్యేకించి ఈనెల 15వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

ఐఎండీ అంచనాలకు అనుగుణంగా ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. వర్షాలు పడుతున్నాయి. పంటలు దెబ్బతినే అవకాశముందని కూడా అలర్ట్ ఉంది. తీవ్రమైన వర్షాలతో పాటు వడగళ్ల వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది గోధుమ పంటతో పాటు పలు పంటలకు నష్టం కలిగించనుంది. అయితే మార్చి 15 తర్వాత మాత్రం భానుడి అసలు స్వరూపం బయటపడనుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి ప్రజలను ముప్పుతిప్పలు పెట్టనుంది.

సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు
మార్చి-మే మధ్యలో దేశంలో చాలాచోట్ల సాధారణం కంటే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చంటున్నారు భారత వాతావరణశాఖ అధికారులు. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని ఐఎండీ తెలిపింది. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం వేసవివరకూ ఉండే అవకాశం ఉందని.. ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది వాతావరణశాఖ.

ఇక ఈ వేసవి సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో కూడా వడగాలుల తీవ్రగా ఎక్కువగా ఉండే అవకాశముంది. వచ్చే రెండు నెలలు ప్రజలు అత్యవసరం ఉంటే తప్పా బయటికి వెళ్లొద్దని హెచ్చరిస్తోంది ఐఎండీ. ప్రస్తుతం వాతావరణం కాస్త కూల్‌గా ఉన్నా… రోజులు గడుస్తున్నా కొద్దీ హీట్‌వేవ్‌ మరింత పెరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర, మధ్య భారత్‌లో మాత్రం మార్చిలో వడగాలుల తీవ్రత లేకపోవచ్చని తెలిపింది.

అనుకూల వర్షపాతానికి కారణమైన ఎల్‌నినో పరిస్థితులు మాత్రం వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనాలున్నాయి. ఎండలు, వడగాలులపై ఇంత వార్నింగ్ ఇచ్చిన ఐఎండీ.. ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి నెలలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Not Losing Weight : ఎంత డైట్ చేసినా ఫలితం లేదా? మీరు బరువు తగ్గకపోవడానికి 5 కారణాలివే..!