Tirumala Brahmotsavalu 2024 : అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

Tirumala Brahmotsavalu 2024 : అక్టోబరు 4 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు

Srivari Brahmotsavam 2024

Updated On : September 29, 2024 / 1:55 PM IST

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిరు వీధుల్లో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు వీఐపీ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ప్రతీరోజూ ఉదయం, రాత్రి రెండు వాహన సేవల్లో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.

Also Read : TTD Board : టీటీడీ బోర్డు నియామకం సంక్రాంతి తర్వాతేనా?

వాహన సేవల వివరాలు..
అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5.45 నుంచి 6గంటల వరకు ధ్వజారోహణం. రాత్రి 9గంటలకు పెద్ద శేష వాహనం.
అక్టోబర్ 5వ తేదీన ఉదయం 8గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3గంటల వరకు స్నపనం, రాత్రి 7గంటలకు హంస వాహనం.
6వ తేదీన ఉదయం 8గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1గంటకు స్నపనం, రాత్రి 7గంటలకు ముత్యపు పందిరి వాహనం.
7వ తేదీ ఉదయం 8గంటలకు కల్పవృక్షం వాహనం. మధ్యాహ్నం 1గంటకు స్నపనం, రాత్రి 7గంటలకు సర్వ భూపాల వాహనం.
8వ తేదీ ఉదయం 8గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11.30గంటల వరకు గరుడ వాహనం.
9వ తేదీ ఉదయం 8గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7గంటలకు గజ వాహనం.
10వ తేదీ ఉదయం 8గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7గంటలకు చంద్రప్రభ వాహనం.
11వ తేదీ ఉదయం 7గంటలకు రథోత్సవం, రాత్రి 7గంటలకు అశ్వ వాహనం.
12వ తేదీ ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30గంటల నుంచి 10.30 గంటల వరకు ధ్వాజావరోహణం.