Samata
Sri Chinna Jeeyar Swamy : ఆధ్యాత్మికత ఉట్టిపడుతున్న శ్రీరామనగరం ప్రజలను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. యాగశాలల ప్రాంతాన్ని ప్రత్యేక ఆలయంగా పరిగణిస్తూ పూజా క్రతువులు నిర్వహిస్తున్నారు. ఈ ఉదయం 6 గంటల 30నిమిషాలకు ప్రారంభమైన అష్టాక్షరీ మహామంత్ర జపం 7 గంటల 30 నిమిషాల వరకు కొనసాగనుంది. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు హోమాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత 10 గంటల 30నిమిషాలకు భద్రాచల ప్రధాన అర్చకులు గుడిమెళ్ల మురళీకృష్ణమాచార్య ప్రవచనాలు. మధ్యాహ్నం 12 గంటల 30 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది.
Read More : Hero : మహేష్ మేనల్లుడు ‘హీరో’ ఓటీటీ రిలీజ్.. డేట్ ఫిక్స్
సాయంత్రం 5 గంటలకు మరోసారు హోమాలు చేస్తారు. ప్రవచన మండపంలో లక్ష్మీనారాయణ అష్టోత్తర శతనామ పూజ, ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇర భవిష్యత్తులో సమతాస్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు యావత్ దేశానికే గర్వకారణమన్నారు. ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో ఆయన సతీసమేతంగా పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. గంట మండపంలో భారీ గంటను మోగించారు.
Read More : Sameer Sharma : తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చుంటే రూ.10వేల కోట్లు మిగిలేవి-సీఎస్ సమీర్ శర్మ
– 10:50 నుంచి 11:10 వరకు అథర్వ వేదపండితుల ఆశీర్వచనాలు
– 11:30 నుంచి 12:00 వరకు అతిథులకు సన్మానం
– మధ్యాహ్నం 2:30 నుంచి 2:50 వరకు యజుర్వేద పండితుల పుణ్యవచనాలు
– మధ్యాహ్నం 3:10 నుంచి 3:30 వరకు రఘునాథ భట్టర్ ప్రవచనాలు
– 3:50 నుంచి 4:10 వరకు వేద పండితుల ప్రవచన పఠనాలు
– 4:10 నుంచి 5:00 వరకు వెంకన్న స్వామి భజన
– సాయంత్రం 5:00 నుంచి 5:30 వరకు విష్ణు సహస్ర నామ పారాయణం
– సాయంత్రం 5:30 నుంచి 5:45 వరకు దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రచవనాలు
– 5:45 నుంచి 6:00 వరకు వేద పఠనం, ప్రవచనం
– 6:00 నుంచి 7:00 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
– 7:00 నుంచి 7:30 వరకు అతిథులకు సన్మానాలు, ఆశీర్వచనాలు
– రాత్రి 7:30 నుంచి 8:00 వరకు మ్యాపింగ్ వీడియో ప్రదర్శనలు
– రాత్రి 8నుంచి 10 వరకు శ్రీమన్నారాయణుడి భజనలు