Sameer Sharma : తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చుంటే రూ.10వేల కోట్లు మిగిలేవి-సీఎస్ సమీర్ శర్మ

సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె.. పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని..

Sameer Sharma : తెలంగాణ తరహాలో డీఏ ఇచ్చుంటే రూ.10వేల కోట్లు మిగిలేవి-సీఎస్ సమీర్ శర్మ

Sameer Sharma

Sameer Sharma : ఉద్యోగులు సానుకూల ధోరణితో ఆలోచించి సమ్మెకు వెళ్లకుండా చర్చలకు రావాలని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పిలుపునిచ్చారు. సమ్మె వల్ల ఎలాంటి లాభం లేదన్నారాయన. సమ్మె వల్ల పరస్పర నష్టదాయకం అని చెప్పారు. ఉద్యోగులు తమ ప్రధాన డిమాండ్లను మంత్రుల కమిటీ దృష్టికి తీసుకొచ్చి పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చని సీఎస్ సూచించారు.

ఉద్యోగుల ఆందోళనలు, ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో సీఎం జగన్ తో భేటీ అనంతరం సీఎస్ సమీర్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. జీతాలు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, జీతాలు ఎక్కడ తగ్గాయో చెప్పాలని అన్నారు.

WhatsApp New Update : వాట్సాప్‌ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. 2 రోజులకు పొడిగించే అవకాశం!

ఏదైనా సమస్య ఉంటే చెబితేనే కదా తెలిసేది అని అన్నారు. పే స్లిప్ లో 10 రకాల అంశాలు పొందుపరిచామని, అన్నింటిని పరిశీలిస్తే జీతం పెరిగిన విషయం వెల్లడవుతుందని తెలిపారు. సందేహాలుంటే పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీ పోల్చి చూసుకోవచ్చని అన్నారు. ఇక, హెచ్ఆర్ఏపై సమస్యలు ఉంటే ప్రభుత్వంతో మాట్లాడాలని సీఎస్ సూచించారు. తెలంగాణ తరహాలో కాకుండా తాము డీఏకి బదులు ఐఆర్ ఇచ్చామని వెల్లడించారు. తెలంగాణ మాదిరే డీఏ ఇచ్చి ఉంటే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేవని అభిప్రాయపడ్డారు.

పీఆర్సీ విష‌యంలో ఆందోళ‌న బాట‌ప‌ట్టిన ఉద్యోగులు.. గురువారం ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 5వ తేదీ నుంచి పెన్ డౌన్ చేస్తామని, 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకి వెళ్తామన్ని తేల్చి చెప్పారు.

”స‌మ్మె విర‌మించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అస‌లు సమ్మె చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్ లాంటిది. దాన్ని సర్దుబాటు చేసుకోవాలి. తెలంగాణ తరహాలో డీఏలిచ్చి ఐఆర్ ఇవ్వకుంటే ఏపీకి రూ.10 వేల కోట్లు మిగిలేవి. కానీ, సీఎం జగన్ ఐఆర్ ఇవ్వాల్సిందేనన్నారు.. పే-స్లిప్పులన్నీ చూస్తే ఓవరాల్ గా గ్రాస్ శాలరీ పెరిగింది” అని సీఎస్ అన్నారు.

Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీ చేతుల్లో?…

సమ్మె నోటీసు విరమించి చర్చలకు రావాలని మరోసారి ఉద్యోగా సంఘాల‌ను కోరారు సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు.

కొంతకాలంగా తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు భారీ ఎత్తున ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్నారు.