Tiruchanoor Sri Padmavathi Ammavari Karthika Brahmotsavam
Tiruchanoor Sri Padmavathi Ammavaru : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా…2021, డిసెంబర్ 05వ తేదీ ఆదివారం రాత్రి శ్రీవారి పాదాలు ధరించిన అమ్మవారు..గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. వాహన మండపంలో రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అమ్మవారి వాహన సేవ ఏకాంతంగా నిర్వహించారు. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతుండడంతో ఆలయ అధికారులు, అర్చకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించి..వాహనసేవ చేయడం ఆనవాయితీగా వస్తుందనే సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవను నిర్వహించారు. అలమేలుమంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షసుఖం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
Read More : Balakrishna : ANRని ఇమిటేట్ చేసిన బాలయ్య.. ఆహా అంటున్న ఫ్యాన్స్
ఇక గరుడ సేవ రోజున తిరుమలలో స్వామి ..గరుత్మంతునిపై విహరిస్తుంటారు. ఇది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైందని పండితులు చెబుతుంటారు. తిరుచానూరులో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో…గుర్తుగా పాదాలను శ్రీవారు పంపుతారంటని పురాణాలు చెబుతుంటాయి. శ్రీవారిని, అమ్మవారిని నిత్యం సేవించే గరుడాళ్వార్లు దాసుడిగా…చాందినీగా..ఆనసంగా..వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు. గరుడపచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు..పద్మావతి సమేతంగా నిజసుఖాన్ని ప్రసాదిస్తారని పురాణాలు వెల్లడిస్తుంటాయి.
Read More : Tomato Prices : చెన్నైలో కిలో టమాటా ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!
గరుడుడు నిత్యసూరులలో అగ్రేసరుడు. గరుడుని రెండు రెక్కలు జ్ఞానవైరాగ్యాలకు చిహ్నాలుగా పురాణాలు చెబుతున్నాయి. వాహనసేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమసలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్లు శేషగిరి, మధుసూదన్, ఏవీఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ ఖన్నా ఇతరులు పాల్గొన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో డిసెంబరు 8న పంచమితీర్థం, డిసెంబరు 9న పుష్పయాగం నిర్వహించనున్నారు.