Ttd
Tirumala Rs 300 Quota Ticket : తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. కరోనా కారణంగా..పలు ఆంక్షలు, నిబంధనల మధ్య భక్తులను తిరుమలకు అనుమతినిస్తున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉచిత దర్శనాలను ఇప్పటికే బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రోజుకు 5వేలకు కుదించింది.
Read More : Fying Fish : పక్షిలాంటి చేప..రెక్కలతో గాలిలో ఎగురుతుంది.
భక్తుల సౌకర్యార్థం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. అందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించి…జూలై 20వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు 5 వేల చొప్పున టికెట్లను మాత్రమే విడుదల చేస్తారు. ఆన్ లైన్ లో ముందస్తుగా…దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వీఐపీ దర్శనాలు మాత్రమే కొనసాగుతోంది.
NSO Group : ఫోన్ ట్యాపింగ్ వార్తలు అవాస్తవం..పరువునష్టం దావా వేస్తాం