NSO Group : ఫోన్ ట్యాపింగ్ వార్తలు అవాస్తవం..పరువునష్టం దావా వేస్తాం

ని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను 'పెగాసస్' అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్​వేర్​ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది.

NSO Group : ఫోన్ ట్యాపింగ్ వార్తలు అవాస్తవం..పరువునష్టం దావా వేస్తాం

Nso

NSO Group భారత్​లోని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్​వేర్​ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ఖండించింది. తమ సర్వర్ల నుంచి డేటా లీక్ అయిన విషయం అవాస్తవమని ఎన్ఎస్ఓ తెలిపింది. వార్తా సంస్థలు ప్రచురించిన ఆ కథనాలకు సరైన ఆధారాలు లేవని, అవన్నీ వాస్తవదూరంగా ఉన్నాయని తెలిపింది. తమ క్లయింట్ల జాబితాలో లోని దేశాల పేర్లనూ కథనంలో పేర్కొన్నారని తెలిపింది.

ఈ కథనాలను అంతర్జాతీయ కుట్రగా ఓ ఇంటర్వ్యూలో అభివర్ణించిన ఎన్ఎస్ఓ గ్రూప్..దీనిపై పరువు నష్టం దావా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది. మేం సాఫ్ట్​వేర్లను ప్రభుత్వాలు, నిఘా సంస్థలకు విక్రయిస్తాం. మాకు విశ్వసనీయమైన వినియోగదారులు ఉన్నారు. మాకు సర్వర్లు లేవు. క్లయింట్ల వద్దే డేటా అంతా ఉంటుంది. 50 వేలకు పైగా పెగాసస్ లక్ష్యాలను గుర్తించినట్లు వార్తా సంస్థలు చెబుతున్నాయి. అది చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడేమో 180 అంటున్నారు. అది క్రమంగా 37.. ఆ తర్వాత 12కు చేరింది. బయటకు వచ్చిన డేటా ఏదో ఇతర జాబితాకు సంబంధించినదై ఉండొచ్చు. మానవహక్కుల మార్గదర్శకాలన్నింటినీ మేం పాటిస్తాం. ప్రాథమికంగా ఈ వ్యవహారం వెనక పోటీదారుల హస్తం ఉందని అనుకుంటున్నట్లు ఎన్ఎస్ఓ గ్రూప్ తెలిపింది.

మరోవైపు, ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదంపై… అందరి ఫోన్లలోని సమాచారాన్ని ఆయన చదివేస్తున్నారంటూ పరోక్షంగా ప్రధానిని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)తో విచారణ చేయించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రదీప్ భట్టాచార్య డిమాండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా.. స్పష్టత ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.

Also Read:    Pegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?