Tirupati-Temple
Udayasthamana Seva Tickets : ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీవారి దర్శించుకొనే విషయంలో పలు రకాల టికెట్లను విక్రయిస్తుంటుంది టీటీడీ, సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం..ఇలా భక్తులకు టికెట్లు అందిస్తుంటుంది. ఇందులో ఉదయాస్తమాన టికెట్లు ఒకటి. ఖాళీ అయిన 531 సేవా టికెట్లను టీటీడీ అధికారులు 2022, ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. బుధవారం 38 సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది.
Read More : Statue Of Equality : స్వర్ణమూర్తికి హై సెక్యూర్టీ.. బుల్లెట్ ప్రూఫ్, జెడ్ కేటగిరి భద్రత
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకొనేందుకు దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు వస్తుంటారు. అయితే.. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా.. నిబంధనల నడుమ భక్తులను దర్శనానికి అనుమతినిస్తున్నారు.
Read More : Medaram Jatara : మేడారం జాతరకు అధికారిక సెలవులు
మరోవైపు… శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది.