Medaram Jatara : మేడారం జాతరకు అధికారిక సెలవులు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Medaram Jatara : మేడారం జాతరకు అధికారిక సెలవులు

holidays for Medaram Jatara : మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు ఈ నెల 19 వరకు జరుగనున్నాయి. మేడారం జాతరకు జిల్లా కలెక్టర్ ఆదిత్య కృష్ణ అధికారిక సెలవులు ప్రకటించారు. సమ్మక్క-సారక్క జాతర జరిగే ములుగు జిల్లా వరకు నాలుగు రోజులపాటు అధికారికంగా సెలవులు ప్రకటించారు. స్కూళ్ళు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారిక సెలవులు ఇచ్చారు.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు మేడారం జాతర జరగనుంది. మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు. సమ్మక్క కూతురైన సారలమ్మ .. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెలపై కొలువుదీరనుంది. రేపు కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు వేడుకగా తీసుకువచ్చి ప్రతిష్టించనున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున జనం మొక్కులను తీర్చుకోనున్నారు. ఇక శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.

Medaram Jatara : నేటి నుంచి మేడారం జాతర.. భక్తుల కోసం హెలికాప్టర్లు

జాతర నిర్వహణకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జాతర విధుల్లో 11వేల మంది పోలీసులు పాల్గొన్నారు. అడిషనల్ డీ.జీ, ఇద్దరు సీపీలు, 10మంది ఐపీఎస్ అధికారులు, 40మంది DSPలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 380 సీసీ కెమేరాలతో జాతర పర్యవేక్షణ జరుగనుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, VIPలు, VVIPల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తిగా వన్ వే ద్వారా వాహనాలను దారి మల్లించారు.