Medaram Jatara : నేటి నుంచి మేడారం జాతర.. భక్తుల కోసం హెలికాప్టర్లు

జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్‌, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి.

Medaram Jatara : నేటి నుంచి మేడారం జాతర.. భక్తుల కోసం హెలికాప్టర్లు

Medaram (3) 11zon

Medaram Jatara : తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 19 వరకు జాతర జరగనుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ .. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెలపై కొలువుదీరనుంది. రేపు కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు వేడుకగా తీసుకువచ్చి ప్రతిష్టించనున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున జనం మొక్కులను తీర్చుకోనున్నారు. ఇక శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.

మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈసారి కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం అవుతుందన్నారు. గత జాతరలతో పోల్చుకుంటే ఈసారి శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు .

Medaram Maha Jatara : మేడారం జాతర.. ఆన్ లైన్‌‌లోనూ కానుకలు

జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్‌, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి రూ.75 వేల ప్యాకేజ్‌, వరంగల్‌ జిల్లా నుంచి రూ.19 వేలు, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రూ.85 నుంచి 90 వేల వరకు ప్యాకేజ్‌ ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు.