Vaikuntha Dwadashi 2022: శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.

Tirumala Project
Vaikuntha Dwadashi 2022: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శుక్రవారం ఉదయం ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను శ్రీవారి ఆలయం నుంచి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుండి 6 గంటల మధ్య స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి దంపతులు, సీవీఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు, వీజీవో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.