Varalakshmi Puja 2023
Varalakshmi Puja 2023 : వరాలు ఇచ్చే తల్లి అందుకే వరలక్ష్మీ దేవి అంటారు. సకల సౌభాగ్యాలు అనుగ్రహించే తల్లి అందుకే ఈ పూజకు అంతటి విశిష్టత. పవిత్రమైన శ్రావణమాసంలో వచ్చే ఈ వరలక్ష్మీదేవి పూజ చేస్తే కుటుంబంలో ఆరోగ్యం, శాంతి, విద్య, కీర్తి, ప్రతిష్టలు విలసిల్లుతాయి. ఒక మహిళలకు శాంతి సౌభాగ్యంతో పాటు అన్ని దక్కుతాయంటే అంతకంటే ఇంకేం కావాలి..? అందుకే ఈ వరలక్ష్మీదేవి పూజలకు అంతటి ప్రత్యేకత అని పండితులు చెబుతున్నారు.
ఆదిలక్ష్మి,ధాన్యలక్ష్మి,ధైర్యలక్ష్మి,గజలక్ష్మి,సంతానలక్ష్మి,విజయలక్ష్మి,విద్యాలక్ష్మి,ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్ములు స్వరూపమే వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఎక్కువగా పెళ్లైన ఆడవారే చేస్తారు. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున అష్టలక్ష్మీ దేవతలందరూ కలిసిన రూపమైన వరలక్ష్మీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబం మొత్తానికి ఆరోగ్యం, శాంతి, విద్య, కీర్తి, ప్రతిష్టలెన్నో దక్కుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. అలా ఈ ఏడాది (2023) వరలక్ష్మీ దేవి పూజ ఆగస్టు 25న వచ్చింది. ఈ ఏడాది అధిక శ్రావణమాసాలు రావటం .. వరలక్ష్మీ పూజను నిజ శ్రావణంలోనే చేసుకోవాలి కాబట్టి ఆగస్టు 25న చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వరాలు యిచ్చే దేవతగా మహిళలు వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.ఈ పండగను ముఖ్యంగా వివాహమైన మహిళలే చేసుకుంటారు. ఎందుకంటే సౌభాగ్యంగా ఉండాలని తమ కుటుంబ సుఖశాంతులతోను శాంతితో వర్ధిల్లాలని మహిళలు ఆకాంక్షిస్తారు. సకల ఐశ్వర్యాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి. వరాలనిచ్చే తల్లి కనుకనే ఆమెను వరలక్ష్మీ దేవిగా కొలుస్తాం. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా పాటిస్తాం. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం గృహిణులు, మహిళలు వ్రతాన్ని నిర్వహిస్తారు. అష్టలక్ష్మీ ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మీ వత్రం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మికగ్రంథాలు పేర్కొంటున్నాయి.
జగన్మాత పార్వతీ దేవి ఒకనాడు సకల సౌభాగ్యాలనిచ్చే వత్రం ఏదైనా వుందా అన్ని పరమేశ్వరున్ని అడిగింది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సిరిసంపదలు, సౌభాగ్యం లభిస్తాయని తెలిపాడు. దీనికి సంబంధించిన కథను కూడా పార్వతీదేవికి చెప్పాడు. పూర్వం మగధ రాజ్యంలోని కుంది నగరంలో చారుమతి అనే వివాహిత వుండేది. ఆమెకు కలలో అమ్మవారు కనిపించి తన వ్రతాన్ని ఆచరించమని కోరింది. అమ్మ చెప్పినట్లుగా చారుమతి. పెద్దలు, కుటుంబసభ్యుల సహకారంతో చారుమతి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించింది. శ్రావణ శుక్లపక్షం శుక్రవారం ప్రాతఃకాలవేళలో స్నానం చేసి ముత్తయిదువులను పిలిచి లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాన్ని ప్రతిష్టించి వ్రతం నిర్వహించింది.
Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీవ్రతం రోజు కలశం ఎలా తయారు చేసుకోవాలి?
వరలక్ష్మీ వ్రతం పూర్తి కాకుండానే ప్రదక్షిణలు చేసే సమయంలోనే చారుమతితో పాటు ముతైదువలను కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహించింది. ధన కనక వస్తువులతో ఆశీర్వదించింది. ఉత్తచేతులతో చారుమతి పూజ చూడాలని వాయనం అందుకోవాలని వచ్చిన ముతైదువలు అంతా కాళ్లు, చేతులు,మెడ అంతా బంగారు నగలతో తిరిగి వెళ్లారు. ఇదంతా చారుమతి దయే అంటూ వారంతా తనను పొగుడుతుంటే ఆమె మాత్రం వినమ్రంగా కాదు కాదు ఇదంతా వరలక్ష్మీదేవి దయ, అనుగ్రహం అని చెప్పింది. మీరు కూడా మీ ఇంట ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ పూజ్ చేసుకోండి అని చెప్పింది. అలా అందరు వరలక్ష్మీ పూజ చేసుకుంటు అమ్మ అనుగ్రహం పొంది సిరి సంపదలతో పాటు శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లారు. ఈ కథను సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పగా ఆమె కూడా అప్పటి నుంచి వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవటం ప్రారంభించింది.