Kanipakam : వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు, నేడు చిన్న, పెద్ద శేషవాహన సేవలు

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.

Varasiddhi Vinayaka Swamy : ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా…స్వామి వారికి 2021, సెప్టెంబర్ 13వ తేదీ సోమవారం రాత్రి మూడో రోజు మూషిక వాహనాన్ని అధిరోహించి…భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి విశ్వకర్మ వంశస్థులు ఉభదారులుగా వ్యవహరించారు.

Read More : CA Final Exam : చెల్లికి 1, అన్నకు 18.. సీఏలో అదరగొట్టిన అన్నాచెల్లెలు, సీఏ పాస్ అవడమే కష్టమనుకుంటే

ఉదయం ఉభయదారులచే స్వామివారి…మూల విగ్రహానికి సంప్రదాయబద్ధంగా పంచామృతభిషేకం నిర్వహించారు లయ అర్చకులు. పుష్పాలంకరణ చేపట్టిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఈవో ఎ.వెంకటేశు, ఏఈవో విద్యా సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More : RBI KYC : బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ వార్నింగ్

బ్రహ్మోత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం తరపున సోమవారం పట్టు వస్త్రాలు ఇక్కడకు తీసుకొచ్చారు. ఆలయ ఈవో భ్రమరాంబ, అర్చకులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి..ఆలయ ఈవో ఎ.వెంకటేశుకు అందచేశారు. వీటిని స్వామి వారికి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2021, సెప్టెంబర్ 14వ తేదీ మంగళవారం స్వామి వారికి చిన్న, పెద్ద శేష వాహన సేవలు జరుగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు