×
Ad

Bheeshma Ekadasi : భీష్మ ఏకాదశి.. ఇవాళ అన్నం తినకూడదా..? తిన్నారో ఆ ఇబ్బందులు తప్పవ్..

Bheeshma Ekadasi : మాఘ మాసంలో శుక్ల పక్షంలో అష్టమి రోజున భీష్ముడు శరీరాన్ని విడిచి పెట్టాడు. దాన్ని భీష్మాష్టమి అనే పేరుతో పిలిచారు. కానీ, అష్టమి రోజున శరీరం విడిచి పెట్టిన భీష్ముడి కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ఏకాదశిని ప్రత్యేకంగా కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి.

Bheeshma Ekadasi

  • నేడు భీష్మ ఏకాదశి
  • భీష్మ ఏకాదశి అంటే ఏమిటి..?
  • ఈరోజు అన్నం ఎదుకు తీసుకోకూడదు

Bheeshma Ekadasi : మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. 2026 జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి వచ్చింది. భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచిదట. అన్నం తినకూడదు.. పాలు, పండ్లు తీసుకోవాలని చెబుతున్నారు.

Also Read : Shani Trayodashi: జనవరి 31 శని త్రయోదశి.. చాలా పవర్ ఫుల్.. ఇలా చేస్తే డబ్బు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి..!

భీష్మ ఏకాదశి అంటే..
మాఘ మాసంలో శుక్ల పక్షంలో అష్టమి రోజున భీష్ముడు శరీరాన్ని విడిచి పెట్టాడు. దాన్ని భీష్మాష్టమి అనే పేరుతో పిలిచారు. కానీ, అష్టమి రోజున శరీరం విడిచి పెట్టిన భీష్ముడి కోసం స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ఏకాదశిని ప్రత్యేకంగా కేటాయించాడు. అదే భీష్మ ఏకాదశి. కృష్ణుడే స్వయంగా భీష్ముడి కోసం కేటాయించిన ప్రత్యేకమైన ఏకాదశి కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అన్నారు. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజున ఎవరైనా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివినా, విన్నా కోట్ల జన్మల్లో పాపాలు తొలగిపోతాయి. అనేక జన్మల శాపాల నుంచి బయటపడొచ్చు. కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.

ఈరోజు అన్నం తినకూడదా..?
ఇవాళ భీష్మ ఏకాదశి. ఈ తిథి నాడు అన్నం తినొద్దంటారు. అందుకు మూడు కారణాలు ఉన్నాయి. ఏకాదశి నాడు పాపపురుషుడు బియ్యంలో ఉంటాడని, దీంతో వండిన పదార్థాలు తింటే చెడు జరుగుతుందని భవిష్య పురాణం చెబుతోంది. బియ్యంలోని తామసిక లక్షణాలు బద్ధకాన్ని పెంచుతాయి. పూజలకు ఆటంకం కలిగిస్తాయి. చంద్రుడి ప్రభావంతో జీర్ణక్రియ మందగిస్తుందని కూడా అంటారు. ఏకాదశి ఉపవాసం

ఉపవాసం ఎలా ఉండాలంటే..
భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మంచిది. అన్నం తినకూడదు. పాలు, పండ్లు తీసుకోవాలి. రాత్రికి పాలు, పండ్లే తీసుకోవాలి. మరునాడు స్నానం చేసి కృష్ణుడిని పూజించుకుని ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్లు ఉదయం పాలు పండ్లు తీసుకుంటూ రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్ధం (ఉప్మా) తినండి. దీన్ని హరి నక్తం అంటారు. ఇలా ఉన్నా కూడా ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది.

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.