Shani Trayodashi: జనవరి 31 శని త్రయోదశి.. చాలా పవర్ ఫుల్.. ఇలా చేస్తే డబ్బు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి..!
అభిషేకం అయ్యాక నవగ్రహాల ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగు పూలు ఉంచండి. లేదా పిడికెడు రాళ్ల ఉప్పు లేదా కొన్ని నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి.
Shani Trayodashi Representative Image (Image Credit To Original Source)
Shani Trayodashi: మాఘ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చో, శని పీడలన్నీ తొలగింపజేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇతర మాసాలలో వచ్చే శని త్రయోదశికంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసాలలో వచ్చే శని త్రయోదశి చాలా శక్తిమంతమైనది. శని.. విష్ణు భక్తుడు. మాఘ మాసం విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో వచ్చే శని త్రయోదశి రోజున శనిని పూజిస్తే, శనికి సంబంధించిన పరిహారాలు చేస్తే శని పీడల నుంచి చాలా సులభంగా బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు.
జనవరి 31.. శనివారం త్రయోదశి కలిసి వచ్చాయి. ఆరోజు ఉదయం పూట త్రయోదశి ఉంది. జనవరి 31 మాఘ మాసంలో వచ్చే శని త్రయోదశి. శని పీడలన్నీ పోవాలంటో ప్రాత:కాలంలో నవగ్రహాల ఆలయంలో శనేశ్వరుడి దగ్గరికి వెళ్లాలి. నవగ్రహాల ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయండి. మీకున్న అనారోగ్యాలు తొలిగిపోతాయి.
డబ్బు సమస్యలు, శత్రు బాధలు ఉంటే..
డబ్బు పరమైన సమస్యలు ఉన్న వాళ్లు కొబ్బరి నీళ్లు శని విగ్రహం మీద పోయాలి. శత్రు బాధలు, ఎదుటి వారి ఏడుపు దిష్టి ఎక్కువగా ఉన్న వాళ్లు ఆవాల నూనె శని విగ్రహం మీద పోయాలి. శనికి నీలం రంగు పూలు ఇష్టం. అభిషేకం అయ్యాక నవగ్రహాల ఆలయంలో శని విగ్రహం పాదాల దగ్గర నీలం రంగు పూలు ఉంచండి. లేదా పిడికెడు రాళ్ల ఉప్పు లేదా కొన్ని నల్ల నువ్వులు లేదా జమ్మి ఆకులు కొన్ని ఉంచండి. ఇలా చేస్తే శని పీడల నుంచి సులభంగా బయటపడొచ్చు.
నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తే ఓం శం శనైశ్చరాయ నమ: అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఇలా జనవరి 31న ఉదయం పూట నవగ్రహాల దగ్గరికి వెళ్లి ఈ విధి విధానం పాటించండి. ఆ తర్వాత కాళ్లు చేతులు కడుక్కుని శిరస్సు మీద నీళ్లు చల్లుకుని కళ్లు తుడుచుకుని దేవాలయం లోపలికి వెళ్లి శివుడిని దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. శని త్రయోదశి రోజున శని త్రయోదశి పర్వం అని ప్రత్యేకమైన సమయం ఉంటుంది. అది సాయంత్రం 5.15 నుంచి 5.45 మధ్యలో ఉంటుంది. ఆ సమయంలో శివాభిషేకం చేస్తే శని పీడల నుంచి తొందరగా బటయపడొచ్చు.
శివ పూజ ఇలా చేయాలి..
శివ లింగానికి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లతో అభిషేకం చేయాలి. లేదా నల్ల నువ్వులు ఆవు పాలలో కలిపి ఆ పాలతో అభిషేకం చేయండి. శివ లింగం లేని వారు శివుడి ఫోటోకి నల్ల నువ్వులతో పూజ చేస్తే నమ:శివాయ అని వీలైనన్ని సార్లు చదువుకుని పూజ పూర్తయ్యాక ఆ నల్ల ఆవులు నానబెట్టి ఆవుకి తినిపించాలి. ఇలా శని త్రయోదశి రోజున శివుడిని పూజిస్తే శని పీడల నుంచి తొందరగా బయటపడొచ్చు.
నవ గ్రహాలు తిరిగాక, శివుడిని దర్శించుకున్నాక ఆలయంలో ప్రత్యేక శని దానం బ్రాహ్మణుడికి ఇవ్వాలి. కేజింపావు నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసర పప్పు.. ఇవన్నీ నల్లని వస్త్రంలో మూట కట్టి పంతులుకి దానం ఇవ్వాలి. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో లేదా మధ్యాహ్నం 1 నుంచి 2గంటల మధ్యలో కానీ లేదా రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో దానం ఇవ్వాలి. ఈ సమయంలో దానం ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. లేదా ఏ సమయంలో అయినా దానం ఇవ్వొచ్చు.
ఆలయానికి వెళ్లలేని వాళ్లు ఇంట్లోనే ఇలా దీపం పెట్టుకోవాలి..
మరి ఆలయానికి వెళ్ల లేని వారు ఇంట్లోనే శని దీపం వెలిగించుకోవాలి. స్నానం చేశాక హాల్ లో శని దీపం పెట్టుకోవాలి. శనికి ఇష్టమైన దిక్కు పడమర. శనికి ఇష్టమైన అంకె 8. స్నానం చేశాక హాల్ లో పడమర దిక్కున ఒక పీట ఉంచి దాని మీద మట్టి ప్రమిదలో మట్టి ప్రమిద ఉంచి శనికి ఇష్టమైన నువ్వుల నూనె పోసి, 8 ఒత్తులను ఒకే ఒత్తిగా చేసి పడమర దిక్కు వైపు వెలిగేలి దీపం పెట్టాలి. ఈ శని దీపం వల్ల కూడా శని పీడల నుంచి బయటపడొచ్చు. శని త్రయోదశి రోజున దశరథ శని స్తోత్రం వినండి. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు, గణపతి తర్పన ప్రియుడు, శని స్తోత్ర ప్రియుడు. ఎన్ని పూజలు, ప్రదక్షణలు, దానాలు చేసినా శనికి స్తోత్రం చదివినా, విన్నా తొందరగా ఆయన అనుగ్రహం పొందొచ్చు.
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
