Yadadri Temple : యాదాద్రి…పుష్కరిణి సిద్ధం, ట్రయల్ రన్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పుష్కరిణి నిర్మాణం పూర్తైంది.

Pushkarini : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు పుష్కరిణి నిర్మాణం పూర్తైంది. కొండకింద గండిచెరువు పక్కనే నిర్మించిన లక్ష్మీ పుష్కరిణిలో నీటిని విడుదల చేసి ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు. 43 మీటర్ల పొడవు, 16.50 మీటర్ల వెడల్పు, 4ఫీట్ల ఎత్తులో నిర్మించిన గుండంలో మోటార్ల సాయంతో 2 ఫీట్ల మేర నీరు నింపి పరీక్షించారు.

Read More : Yadadri Temple : యాదాద్రి ఆలయ ప్రారంభం, ముహూర్తం ఫిక్స్!

గుండంలో మండపాలు, మెట్ల దగ్గర కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి.స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఏక కాలంలో 15 వందల మంది భక్తులు స్నానమాచరిచేందుకు వీలుగా 11 కోట్ల 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2.47ఎకరాలలో లక్ష్మీపుష్కరిణీ నిర్మించారు. పనులు పూర్తి చేసుకుని తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఇక లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు 2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం 10 లక్షల 25 వేల 6 వందల 21 రూపాయలు ఆదాయం వచ్చింది. ప్రధాన బుకింగ్‌తో లక్షా 5 వేలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయంతో 5 లక్షల 54 వేల 550 రూపాయలు వచ్చాయి.

Read More : Yadadri Temple: విద్యుత్ దీపాల ధగధగలు.. గోల్డెన్ టెంపుల్‌లా యాదాద్రి!

మరోవైపు… ఆలయాన్ని దసరా నాటికి ప్రారంభించాలనే దిశగా…ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొండపై చేస్తున్న నిర్మాణాల పనులు ఓ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువున మాత్రం కొన్ని ప్రధాన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. వీటిని అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. దసరాకు ప్రారంభించే విషయంలో సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. దసరాకు ప్రారంభించడానికి కాకపోతే..వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవం చేపట్టే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు