UK club cricket team : ఒక్కడికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదా.. 2 పరుగులకే ఆలౌట్.. అందులో ఓ ఎక్స్‌ట్రా రన్.. 9 మంది డకౌట్..
ఓ టీమ్ ఏకంగా 426 పరుగులు చేస్తే.. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జట్టు అక్షరాలా రెండు అంటే రెండు పరుగులే చేసింది.

1 run 1 wide 10 wickets English Cricket Team Bowled Out For Two After Conceding 426
క్రికెట్‌లో ఇప్పటి వరకు మనం ఎన్నో రికార్డులు చూసి ఉంటాం గానీ.. ఇలాంటిది మాత్రం చూసి ఉండరు. గల్లీ మ్యాచ్‌ల్లోనూ సైతం ఇలాంటి రికార్డు నమోదు కావడం కాస్త కష్టమే. ఓ టీమ్ ఏకంగా 426 పరుగులు చేస్తే.. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన జట్టు అక్షరాలా రెండు అంటే రెండు పరుగులే చేసింది. అవును ఇది నిజంగా నిజం. ఇందులో ఓ పరుగు వైడ్ రూపంలో రావడం గమనార్హం.
ఇంగ్లాండ్‌లోని మిడిలెసెక్స్ కౌంటీ లీగ్‌లో ఈ విచిత్రం చోటు చేసుకుంది. నార్త్ లండన్ సీసీ, రిచ్మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిచ్మండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నార్త్ లండన్ జట్టు మొదట బ్యాటింగ్ దిగింది. డానియల్ సిమన్స్ (140) సెంచరీతో చెలరేగడంతో 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 426 పరుగులు సాధించింది.
North London CC 3rd XI v Richmond CC, Middlesex 4th XI.
The most ridiculous and one-sided cricket scorecard I have ever seen.
Perhaps making the decision to field was the wrong one. 🤔 pic.twitter.com/iMbqIFZIfI
— Gentleman of the North (@UnionistJack) May 25, 2025
427 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రిచ్మండ్ జట్టు 5.4 ఓవర్లలో 2 పరుగులకే ఆలౌటైంది. ఇందులో ఓ పరుగు ఎక్స్‌ట్రా రూపంలో రావడం గమనార్హం. 11 మంది బ్యాటర్లు కలిసి ఒక్క పరుగు మాత్రమే చేశారు. ఆ పరుగును కూడా టామ్ పెట్రిడ్స్ చేశాడు. తొమ్మిది మంది బ్యాటర్లు డకౌట్ అయ్యారు. నార్త్ లండన్ బౌలర్లలో మాథ్యూ రాన్సన్ 5 వికెట్లు, థామస్ పాటన్ మూడు వికెట్లు తీశారు. దీంతో నార్త్ లండన్ 424 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
LSG vs RCB : ఆర్‌సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్.. హెడ్-టు-హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్టు ఇంకా..
ప్రస్తుతం ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్కోర్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీ కంటే గల్లీ జట్లే బాగా ఆడుతాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.