LSG vs RCB : ఆర్‌సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్.. హెడ్-టు-హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్టు ఇంకా..
ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచేందుకు ఆర్‌సీబీకి ఈ మ్యాచ్ ఎంతో కీలకం. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన లక్నో జట్టు విజయంతో ఈ టోర్నీని ముగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం..
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఎక్కడ..? కేకేఆర్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. మరీ ఇంత నీచంగానా..
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో రెండు మ్యాచ్‌ల్లో లక్నో విజయం సాధించగా మరో మూడు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలుపొందింది. ఇక లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరు జట్లు ఒక్క సారి మాత్రమే తలపడగా అందులో లక్నో గెలవడం గమనార్హం.
లక్నో వర్సెస్ ఆర్‌సీబీ గత 5 మ్యాచ్‌ల ఫలితాలు..
* లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలిచింది.
* లక్నో సూపర్ జెయింట్స్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పరుగుల తేడాతో గెలిచింది.
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలిచింది.
పిచ్ రిపోర్ట్..
లక్నోలోని ఎకానా స్టేడియంలోని పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. బంతి బ్యాట్ మీదకు వస్తూ ఉంటుంది. ఇరు జట్లలోనూ బిగ్ హిట్టర్లు ఉండడంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
వర్షం ముప్పు ఉందా?
ఇక ఈ మ్యాచ్‌కు ఎలాంటి వర్షం ముప్పు లేదు. గరిష్ట ఉష్ణోగ్రత 36°C, కనిష్ట ఉష్ణోగ్రత 29°C ఉంటుందని అంచనా.