Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఎక్కడ..? కేకేఆర్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. మరీ ఇంత నీచంగానా..
మూడో టైటిల్ సాధించి సంవత్సరం పూరైన సందర్భంగా సోషల్ మీడియాలో కేకేఆర్ ఫ్రాంచైజీ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

KKR 3rd IPL Title Anniversary Shreyas Iyer Snubbed
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో అంచనాలను అందుకోవడంలో విపలమైంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. కాగా.. సరిగ్గా ఏడాది క్రితం మే 26న ఐపీఎల్ 2024 విజేతగా నిలిచింది. కేకేఆర్‌కు ఇది మూడో ఐపీఎల్ టైటిల్. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. మూడో టైటిల్ సాధించి సంవత్సరం పూరైన సందర్భంగా సోషల్ మీడియాలో కేకేఆర్ ఫ్రాంచైజీ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేకేఆర్ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ టైటిల్ ఉంది. ‘ఆ రోజును చరిత్రలో ఎన్నడికి మరిచిపోలేము. ఎప్పటికి అది హృదయాలలో నిలిచి ఉంటుంది.’ అంటూ రాసుకొచ్చింది. అయితే.. ఈ ఫోటోలో కేకేఆర్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేడు. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ పై శ్రేయస్ అభిమానులు మండిపడుతున్నారు. కేకేఆర్‌కు కనీసం కృతజ్ఞత లేదని విమర్శిస్తున్నారు.
ఐపీఎల్ టైటిల్‌ను అందించినప్పటికి శ్రేయస్ అయ్యర్‌ను కేకేఆర్ వేలానికి విడిచిపెట్టింది. మెగావేలం2025లో పంజాబ్ కింగ్స్ శ్రేయస్ ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంతో పాటు టాప్-2 లో స్థానం దక్కించుకుంది. సోమవారం ముంబై పై విజయం సాధించడం ద్వారా పంజాబ్ క్వాలిఫయర్1లో చోటు దక్కించుకుంది. కాగా.. 2014 తరువాత పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి.
The man gave it everything.. and you can’t even give him a mention?
KKR, where’s Iyer in the frame?🤦♂️— Karan Singh Dhillon (@karandhillon28) May 26, 2025
ముంబై పై గెలిచిన తరువాత పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు సరైన సమయంలో బాధ్యత తీసుకుని ఆడారని అన్నాడు. ఎలాంటి పరిస్థితిలోనైనా మనం గెలవాలి అనే మనస్తత్వంలో జట్టు ఉందని చెప్పాడు. పంజాబ్ కింగ్స్ విజయంలో రికీ పాంటింగ్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం కీలక పాత్ర పోషిస్తోందన్నాడు. తాను ప్రతి వ్యక్తి నమ్మకాన్ని పొందడం గురించి మాట్లాడుతూ.. అది మ్యాచ్‌లను గెలవడం ద్వారానే సాధ్యమైందన్నాడు. వ్యక్తిగతంగా మనం ఆ సంబంధాన్ని కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ఇక ఎవరైనా సరే నిరాశలో ఉన్నప్పుడు ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడం చాలా సులభం అని అయ్యర్ తెలిపాడు.
RCB : ఆర్‌సీబీకి సీఎస్‌కే సాయం.. ఇక బెంగళూరు టాప్-2లోకి రాకుండా ఎవరూ ఆపలేరు..!
కాగా.. అయ్యర్ వెన్నుపోటు వ్యాఖ్యలు కేకేఆర్‌ను ఉద్దేశించినవే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.