PBKS vs MI : శ్రేయస్ అయ్యర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఇష్టపడని హార్దిక్ పాండ్యా..! ఏదో తేడా కొడుతుంది సామీ..
సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.

IPL 2025 PBKS vs MI Hardik Pandya refuses handshake with Shreyas Iyer
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్-2లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. క్వాలిఫయర్ 1లో తలపడే అవకాశాన్ని అందుకుంది. ఈ ఓటమితో ముంబై పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికే పరిమితమైంది. ఆ జట్టు ఫైనల్ చేరేందుకు రెండు మ్యాచ్‌ల్లో (ఎలిమినేటర్, క్వాలిఫయర్2లో) విజయం సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
కాగా.. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇందులో హార్దిక్ పాండ్యా ఒక్కసారి కాదు రెండు సార్లు శ్రేయస్ అయ్యర్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినట్లుగా కనిపిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉన్నట్లుగా అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
LSG vs RCB : ఆర్‌సీబీ, లక్నో మధ్య కీలక మ్యాచ్.. హెడ్-టు-హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్టు ఇంకా..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకాన్ని సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ సాధించాడు.
Anyone noticed yesterday, Hardik Ignored Shreyas twice 🤔
What’s cooking between them 💀 pic.twitter.com/ib5atXL1GL— NeatObserver (@NeatObserver) May 27, 2025
Shreyas Iyer : శ్రేయస్ అయ్యర్ ఎక్కడ..? కేకేఆర్ పై మండిపడుతున్న ఫ్యాన్స్.. మరీ ఇంత నీచంగానా..
అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. జోష్ ఇంగ్లిస్ (73; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియాంశ్ ఆర్య (62; 35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో మిచెల్ శాంట్నర్ రెండు వికెట్లు తీశాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు.